పుట:2015.329863.Vallabaipatel.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

వల్లభాయిపటేల్

ప్రతి రచయితకు నొక శైలియుండునట్లే యొక్కొక్క ప్రముఖున కాయన మనస్తత్త్వమును, భావమునుబట్టి భాషకూడ నుండును. సర్దార్ పటే లాత్మగౌరవముగలవ్యక్తి. పోటుమానిసి. కనుక నాయన స్వభావమునకుఁ దగిన భాష బార్డోలీలోఁ బ్రచారమైనది. ప్రజలలో నొక విధమైన ధైర్యము, పట్టుదల, యాత్మగౌరవము నధికమైనట్లుగానే, భాషావిషయములోఁగూడ నట్టి మార్పే కలిగినది.

సబర్మతీ తీరానఁగూర్చుండి గాంధీజీ, బార్డోలీ పొలములలోనుండి వల్లభాయి, యభివృద్ధిచేసిన గుజరాతీభాష సహజమైనదేగాక ధీరోదాత్తమైనది.

సాహిత్యము ప్రజల పరాక్రమప్రసాదము. "యథా భాషకస్మధా భాషా." భాషించువానినిబట్టియే భాషయుండును. సాహిత్యోన్నతి ప్రజల యున్నతిద్వారానే కలుగును. ఏ పండితులు, కవులు నభివృద్ధి చేయలేని భాషావృద్ధి బార్డోలీ కిసానులు చేసిరి.ఈ యభివృద్ధి కాదిపురుషుఁడు వల్లభాయి.

కాంగ్రెసులో

పటేల్‌కు 1916 లోనే గాంధీజీతోఁ బరిచయ మేర్పడినది. నాటినుండి యాయన ప్రజాసేవఁ బ్రారంభించెను. అందుచేతనే యాయన 1916లో లక్నోలో జరిగిన కాంగ్రెసుకుఁ బ్రతినిధిగా వెళ్లెను.

1918 - 19 - 21 - 22 సంవత్సరములలోఁ గాంగ్రెసుకుఁ సంయుక్త కార్యదర్శిగాఁ బనిచేసెను.