పుట:2015.329863.Vallabaipatel.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[5]

వల్లభాయిపటేల్

33

బ్రిటిషుప్రభుత్వపు హయాములో నిట్టి విజయమున కిదియే ప్రథమము. ఈ బార్డోలీ విజయము భారతదేశపు రైతాంగములో నధికచైతన్యము కలుగఁజేసి యనేకోద్యమములకు మూలమైనది. సర్దారుపటేలు ఖ్యాతి యీ విజయముతో విశ్వవిఖ్యాతమైనది. ఈ సందర్భములో (1938 నవంబరు 51) కృష్ణాపత్రికాప్రధాన వ్యాసమునుపహరించుట సముచితమని తలఁచుచున్నాను.

బార్డోలీ కథ

"సత్యాగ్రహ సమరములో నెనిమిది సంవత్సరముల క్రిందట బార్డోలీతాలూకారైతులు చూపిన త్యాగసాహసములు చరిత్రాంకితము లైపోయినవి. ప్రపంచేతిహాసములో నట్టియుదంతము మఱియొకటి యున్నదో లేదో సంశయాస్పదము. రైతులకును వారి భూములకును గల సంబంధ మతినిగూఢము. ఏనాఁడు వారితాతలు ముత్తాతలు వానిని సంపాదించిపెట్టిరో! తరతరాలనుండి యనుభవించుచుండిన స్థిరాస్థు లవి. పంటలు పండినను బండకపోయినను వానినే కనిపెట్టుకొని, సంసారముల నెటులో పోషించుకొని వచ్చుచుండిరి. యజమానిపాదము పైని బడునప్పటికి, భూమి యానందముతోఁ బొంగునని పెద్దలు చెప్పుదురు. అట్లనుసృతముగా, వంశపరంపరగాఁ బ్రేమామృత ధారవలె వచ్చుచుండిన భూములను, బార్డోలీ రైతులు, దేశము కొఱకు, స్వరాజ్యముకొఱకు, వదలుకొని, తామును, బిల్లలను, నిరాధారులై, గ్రామభ్రష్టులై, యెట్లు చెట్లుచేమలు