పుట:2015.329863.Vallabaipatel.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

31

ప్రభుత్వమువా రొక కోమటిని బట్టుకొని పన్నీయవలసినదని ప్రతిబంధించిరి. లోకములో నందరికంటెఁ బిఱికివాఁడని యనుకొను నాయనకూడఁ గఱకుదనము చూపుటచే, వారు చీలదీసిపరిపాలించు సూత్రము ననుసరించి యొక మహమ్మదీయుని బట్టుకొనిరి. ఆయనయుఁ బైసగూడ నియ్యలేదు. పఠానులను దీసికొనివచ్చి యనేక దౌర్జన్యములను జేయించిరి. ఏమి చేయించినను బ్రయోజనము లేకపోయెను.

ఇట్లు వారు పెక్కు బాధలకు లోనగుటయేగాక బార్డోలీతాలూకాలోని 80 వేల రైతాంగము నిల్లు వాకిలి వదలి, బ్రిటిషుఇండియా దాటి, బరోడాసరిహద్దులకు వలస పోఁ జొచ్చిరి. 80 యేండ్లు వృద్ధురాలు పటేల్‌తల్లి వంట చేయుచుండఁగా దానిని బోరలద్రోసి రాళ్ళు రప్పలు వేసిరి. ప్రజల నహింసాపథమునుండి తప్పించుట కనేకవిధముల రెచ్చఁ గొట్టిరి. కాని ప్రజ లచంచలులై యహింసామార్గమునే యంటిపెట్టుకొని యుండుట ప్రపంచచరిత్రలో నపూర్వము. బార్డోలియే యహింసానీతికి నిలఁబడ గలిగినది. ఈసత్యాగ్రహ యుద్ధములో మహిళామణులలోఁ జెప్పరాని చైతన్యము గలిగినది. వారుకూడఁ గదనరంగములోఁ గాలుపెట్టిరి. బొంబాయినుండి సోదరి మీటుపెటిట్, శ్రీమతి సురాజ్ మెహతా ప్రభృతులిందులోఁ బ్రవేశించి నారీశక్తిని ప్రపంచమునకు బ్రదర్శింపఁ జేసిరి. ప్రభుత్వమువా రరెష్టులు, జప్తులు వేలములు రాక్షసకృత్యములు చేయసాగిరి. వేలు ఖరీదుచేయు సుక్షేత్రములు మిక్కిలి తక్కువ ఖరీదుకు వేలము పడఁ జొచ్చెను. తమ బిడ్డలకంటె నధికముగాఁ జూచుకొను రైతాం