పుట:2015.329863.Vallabaipatel.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[4]

వల్లభాయిపటేల్

25

వివిధ ప్రాంతములనుండి వాలంటీర్లు వచ్చి ఖైదులో నంతులేని బాధల నొందిరి.

పటేలు సోదరులు ముఖ్యముగ నా యుద్యమమున కండఁగా నిలఁబడిరి.

జులై 18 వ తేది పతాకాదినముగా నిర్ణీత మయ్యెను. కాంగ్రెసు కార్యనిర్వాహక వర్గము వా రా నాఁడు దేశమంతటఁ బతాకోత్సవములు, నూరేగింపులు జరుపవలసినదిగా రాష్ట్ర కాంగ్రెసు సంఘములకుఁ దాఖీదులు పంపించిరి.

తదాజ్ఞానుసార మన్ని ప్రాంతముల యందును బతాకోత్సవము విజయోపేతముగ సాఁగెను. వల్లభాయి పటేలు కూడ జులై 18 తారీఖునఁ ప్రభుత్వము వారిచే నిషిద్ధప్రదేశముగా నిర్ణయింపఁబడినచోటఁ బతాకోత్సవము జరిపించెను. ప్రభుత్వము కిమ్మనలేదు. తరువాతఁ బ్రభుత్వమువారు సత్యాగ్రహుల నందఱను బేషరతుగా విడుదలచేసిరి.

బోర్సద్ సత్యాగ్రహము

బోర్సద్ గ్రామ మరాజక వాదులకు దోపిడిగాండ్రకు నిలయమని చెప్పి ప్రభుత్వము ప్రత్యేకపుఁ బోలీసు సిబ్బంది నక్కడఁబెట్టి, వారిపై 1922లో రెండులక్షల నలుబదివేల రూపాయల యదనపుపన్ను శిక్షార్థము విధించిరి. ఇది చాల నక్రమమైన యారోపణము. ఈ దోపిడులు పోలీసువారి యిషారావల్ల జరుగుచున్నవిగాని మఱియొకటికాదు. (పోలీసుల తుపాకులుకూడ దోపిడిగాండ్ర యొద్దనుండెను. పటే లీ విషయ