పుట:2015.329863.Vallabaipatel.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

24

వల్లభాయిపటేల్

డిప్యూటీ కమీషన రప్పుడు మ్యునిసిపల్ అధ్యక్షుఁడుగా నుండెను. అతఁ డీ సందర్భమునఁ జాల గర్హ్యముగాఁ బ్రవర్తించెను. అందుచేతఁ గౌన్సిలర్లందఱు వెంటనే రాజీనామాల నిచ్చిరి. జిల్లాకాంగ్రెసుసంఘము సత్యాగ్రహము ప్రారంభించెను.

యువజనులు జట్లుజట్లుగా వచ్చి జాతీయపతాకము నా భవనముపైఁ బ్రతిష్ఠించుటయుఁ బోలీసులు లాగివేయుటయు జరుగుటయేగాక, వాలంటీర్లను ఖైదుచేయుటయు జరుగుచుండెను.

ఈ సంఘటనలే నెమ్మదిగా నాగపూరు ప్రాకెను. 1931 మే 1 వ తేదీన నాగపురములో నా నగరములోని సివిలు లైనులలోనికిఁ బోఁగూడదని 144 సెక్షను జారీచేసిరి. కాంగ్రెసు వాలంటీలర్లు తమ యిష్టము వచ్చినవీధికి జాతీయపతాకమును దీసికొని పోవుటకు హక్కు కలదని పట్టు పట్టిరి. పోలీసులు వారి నరెస్టు చేసిరి. క్రమానుగతముగ నదియొక యుద్యమముగా నభివృద్ధి చెందినది. కాంగ్రెసు కార్య నిర్వాహకవర్గమువారు నాగపూరు వాలంటీర్ల నభినందించిరి. నాగపుర సత్యాగ్రహోద్యమ సంఘమువారికి సహాయము చేయుటకుఁ దీర్మానించిరి. ఈ యుద్యమ సందర్భమున సేట్‌జమ్నాలాల్ బజాజ్ కూడా నరెస్టు చేయఁబడెను. అందువలననే యఖిలభారత కాంగ్రెసుసంఘము నాగపురములో సమావేశమై పతాకోద్యమమునకు హృదయపూర్వకముగ సహాయముచేయుటకుఁ దీర్మానించిరి. నాగపురసత్యాగ్రహమునందుఁ బాల్గొనుటకు