పుట:2015.329863.Vallabaipatel.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

18

వల్లభాయిపటేల్

తలఁచుచుంటిని. నేను బాఠశాలలోఁ జదివిన గ్రంథముల సారాంశ మేమన - మన దేశీయు లల్పులు, బుద్ధిహీనులు, మనపై రాజ్యముచేయు విదేశీయులు మనమేలు గోరువారు. వారే మన యుద్ధారకులు, ఉత్తములు. మన దేశీయులు వారిసేవచేసి బ్రతుకు బానిసలు. ఈ నిద్యావిషప్రచారము దేశమందంతటఁ జేయఁబడినది."

1915లో నహమ్మదాబాదులో గాంధీజీ - సత్యాగ్రహము ప్రారంభించి స్థానికులైన పెద్దలను గలసికొనుటకై గుజరాతు క్లబ్బుకు వచ్చెను. అప్పుడు వల్లభాయి చీట్లాడు చుండెను. ప్రక్కనున్న మవలంకరు గాంధీజీ రాఁగానే యాయన కడకుఁబోగాఁ బటేలు గాంధిజీ నెంతో శ్లేషగా విమర్శించెను.

తరువాతఁ బటేలుకు మహాత్మునితో 1917 లో సన్నిహిత సంబంధ మేర్పడెను. అప్పటినుండి యాయన జీవిత విధానమే మాఱిపోయినది. ఆ దొరలవేషము, డాబు, దర్పము, రీరి రివాజులు పోయినవి. ధోవతి, యుత్తరీయము, లాల్చీ, వేష ధారణమైనది. వేషములోనేకాదు, అసలు వ్యక్తిలోనే మార్పు వచ్చినది. ఆనాటనుండి ప్రజలలో నాయన యొకఁ డైనాఁడు. ఒకఁ డగుటయేకాదు - ప్రజాసేవయే సర్వస్వమైనది. దేశభక్తియే యాయన మత మైనది. కార్యదీక్షయే యాతని లక్షణము. స్థితప్రజ్ఞత్వమే యలంకారము - వేయేల ? ఆయన జీవిత విధానమే పరివర్తన చెందినది.

ఒకనాఁడు గాంధిజీని బరిహసించిన పటేలు మఱొకనాఁడు గాంధీజీ సిద్ధాంతముల నాచరించువారిలో నగ్రశ్రేణికిఁ