పుట:2015.329863.Vallabaipatel.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[3]

వల్లభాయిపటేల్

17

డనే కాపురముపెట్టి యపారముగ నార్జింపసాగినాఁడు. ఇంతలోనే యాయన జీవితవిధానము మఱియొక విధముగ మారవలసి వచ్చినది.

తాఱుమాఱు

ఆంగ్ల విద్యాభ్యాసమువల్ల, ప్లీడరీవృత్తివల్లఁ బటేలులో క్షీణించుచు వచ్చిన జాతీయత పాశ్చాత్యదేశవాసమువల్లఁ బూర్తిగాఁ బోయినది. దొరల వేషభాషలు, రీతి రివాజులు బాగుగా నలవాటైనవి. పిల్లలనుగూడ నింగ్లండు పంపవలయునని తలంచి ముందుగఁ గాన్వెంటులోఁ జేర్చినాఁడు.

తాను జుట్టు, సిగరెట్టు, పలాస్, మధుపానముల కలవాటైనాఁడు. అన్నతో నప్పుడప్పు డనవసరమైన యర్థరహితమైన హాస్యాలకు దిగి ప్రొద్దుపుచ్చుచుండెడివాఁడు.

పదిమందితోఁ గలసి తిరుగకుండెను. పలుక కుండెను. కోరచూపులు చూచుచుండెను. ఆయన దగ్గరకు వచ్చిన వారితోఁగూడ మందహాసము చేయుటయేగాని పల్లెత్తి పలుకరించువాఁడుకాఁడు. తా నెక్కడనుండియో యూడిపడ్డ ట్లహంకారము చూపించువాఁడు. రాజభక్తి, బ్రిటను నందుభక్తి యానాఁ డాయనలో నధికముగా నుండెను.

గుజరాతు క్లబ్బులో నాయన యొకసారి యీవిధముగాఁ జెప్పెను. 'దుర్గాపూజ పండుగనాఁడు నే నంతులేని యానందములో నిమగ్నుఁడనై యుండువాఁడను. ఆ పండుగను బట్టించుకొనువాఁడనే కాదు. వినోదమే నాకెక్కువ. భారతీయులు విదేశీయుల ననుసరించుటయే యభివృద్ధికర మార్గమని