పుట:2015.329863.Vallabaipatel.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

16

వల్లభాయిపటేల్

ఇంగ్లాండులో వల్లభాయి యధికపరిశ్రమ చేయు విద్యార్థి యనువిఖ్యాతిఁ గాంచినాఁడు. ఆయన బసనుండి మిడిల్ టెంపిల్ పదునొకండు మైళ్ళ దూరమున నున్నది. ప్రతిరోజు నడచి యంతదూరము వెళ్ళుచుండెను. వెళ్ళటయే కాదు, అక్కడ దినమునకుఁ బదునేడుగంటలు చదువు చుండెనఁట. వేకువనే లేచి నిత్యకృత్యములు తీర్చికొని యక్కడనే యన్నపానీయముల నారగించువాఁడు. ఆయన యధ్యయనములో నిమగ్నుఁడైయుండఁ దుదకు బంట్రౌతువచ్చి టైమయిపోయిన దని చెప్పువఱకు లేచెడివాఁడుకాఁడు.

ఆయన కృషి ఫలించినది. ప్రథమశ్రేణిలో నుత్తీర్ణుఁ డగుటయేగాక యేఁబదిపౌనుల విద్యార్థి వేతనముగూడ లభించినది. ప్రశ్నపత్రముల కీయనవ్రాసిన సమాధానములు చూచి యా పరీక్షాధికారి యాశ్చర్యపడి ప్రధాన న్యాయాధిపతికి సిఫారసు ఉత్తరముకూడ నిచ్చెను.

ఆయన నాఁడు నేఁడు కూడ నన్యాయమును సహింపఁడు. ఇంగ్లాండులో నుండు రోజులలో నాయన యొకరి యింటిలో బసచేసెను. ఆ పేదరాసిపెద్దమ్మ యొక ధనవంతుని కుమార్తెను బట్టుకొని తనకుఁ గొంతమొత్తమునకు జెక్కువ్రాసి యిమ్మని బలవంత పెట్టసాగినది. ఈసంగతిఁ బసికట్టి పటేలు పోలీసు వారిని దీసికొనివచ్చి యా పెద్దమ్మను బట్టించియిచ్చి యా పిల్లను వదలిపెట్టించెను.

బారిష్టరుపరీక్ష యైనతరువాత నాయన బయలుదేరి 1913 ఫిబ్రవరి 13 తేదిన బొంబాయి చేరినాఁడు. ఆ మఱుసటి దినముననే యహమ్మదాబాదులో నడుగుపెట్టినాఁడు. అక్క