పుట:2015.329863.Vallabaipatel.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

12

వల్లభాయిపటేల్

మీదఁ గ్రుద్ధుఁడై పటేలును శిక్షింపవలసినదని హెడ్మాస్టరు వద్ద కాయన పంపించెను. ఆ ప్రధానోపాధ్యాయుఁడు యధార్థము చెప్పవలసినదని పటేలు నడిగెను. అంతటఁ బటేలు చేటభారతము నిట్లు విప్పెను - 'ఏమిచేయనండీ? ప్రతిరోజును నన్ను వ్రాసికొని రమ్మని వేధించుచున్నాఁడు ఇది యొక శిక్షయా? నేను జదివికొను పుస్తకమునుండి యేదైన వ్రాసికొని రమ్మనినఁ గొంత ప్రయోజన ముండును. వ్రాసినదే వ్రాసినచో నేమి ప్రయోజన ముండఁగలదు?" ప్రధానోపాధ్యాయుఁడు వల్లభాయి చెప్పిన మాటలను విని యతని నేమియు శిక్షింపక యూరకయే వదలిపెట్టెను. ఆ హెడ్మాస్ట 'రిట్టి పిల్లవాని నే నెన్నఁడుఁ జూడలే దని జీవితాంతమువఱకు నను చుండెడివాఁడు.

ఇట్లు పటేలు నిర్భయత, సాహసము, వినోదమును దెలియఁజేయు ఘట్టము లెన్నో విద్యార్థిదశయందుఁ గలవు.

నడియాడ్‌లో మఱొక యుపాధ్యాయునితో వివాద మేర్పడెను. తత్ఫలితముగా నాయన బడౌదా హైస్కూలు నుండి పంపివేయఁబడెను. తరువాత మఱల నడియాడ్‌లో హైస్కూలులోఁ బ్రవేశించి మెట్రిక్ పరీక్షలో నుత్తీర్ణుఁడైనాఁడు.