పుట:2015.329863.Vallabaipatel.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
151
వల్లభాయిపటేల్

హలము నీడేర్చును. వల్ల భాయిని బ్రశ్నించుటకే సహజముగా ధైర్యముండదు. ఆయనను బ్రశ్నించువారు వ్రేళ్ళమీదఁగూడ లెక్కపెట్టుట కుండరు. ఆయన స్వభావ మేమియనఁ దన విరోధికే యాయన జవాబు చెప్పును. మహాత్ముడు తన యాత్మకథ రచించగలఁడు. వల్లభాయి యాత్మచర్చ యెన్నడును జేయఁడు. మహాత్మాజీయొక్క సంయమము. నాయన తపస్సు, మహత్తరమైన కృషీఫలితము. వీరవల్ల భాయియొక్క సన్యాస మొకనాటి ప్రాతఃకాలమునఁ జేయబడినదైనప్పటికి నిలుకడగల దైనప్పటికి యోధునిప్రతిజ్ఞగా నుండును. మహాత్మాజీ సాధకుఁడు, సంస్కర్త, బోధకుఁడు - వల్లభాయి సాధకుఁడుకాదు. సంస్కర్తకాదు. బోధకుఁడుగాదు. అతఁడు యోధుఁడు, సేనాని, సేనాధిపతి. మహాత్మునియొక్క మహత్తరమైన క్షమాగుణములో నాత్మనిరీక్షణ, యాత్మచింతన కలదు. వల్లభాయియొక్క క్షమ వీరోచిత క్షమ. దానిలోఁ దన ప్రత్యర్థియొక్క నూరుతప్పులను మన్నించగలఁడు.

'కర్మవీర్‌'-

సర్దార్

పలువిధములఁ బరామర్శించినప్పటికి వల్లభాయిని గుఱించి యొక్కమాటలోఁ జెప్పవలయునన నతఁ డాత్మరక్షణ పరుఁడు. తన దేశమునకై బలియగు పురుషుని గుణగణము లాయనలో గుమిగూడినవి. ఆయన యోధుఁడు. బుద్ధి, వివేకము, పరిస్థితి, మౌనావలంబనము, సంఘటనాశక్తి, యీ యోధుని యోధునికంటె గొప్పవానినిగాఁ జేసినవి. ఆయన