పుట:2015.329863.Vallabaipatel.pdf/156

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

149

యిష్టముండదు. అత డాపదల నాలింగన మొనర్చును. వీరత్వ మాయనసహచారిణి. సాహస యాయన యనుచరుఁడు. ఆకాశము మేఘావృతమైనప్పుడు రాజకీయవేత్త ముఖములో విచార మేర్పడును. ఈ పరిస్థియే యోధునికి హృదయానందకరమై, ద్విగుణీకృతోత్సాహుఁడగును. శత్రువుయొక్క సవాలు విని రాజకీయవేత్త యిపుడు పోరాటముచేయవలెనా, యక్కర లేదా యని యాలోచించును. యోధుఁడో వెంటనే రణరంగమున నుఱుకును. ఈ దృష్టిలో లోకమాన్యుఁడు వల్లభాయి సమాన ప్రవృత్తి కలవారైనప్పటికిని వారిలోఁ దేడా కలదు.

'గాంధీజీ దృక్పథములో -'

మహాత్మునితో వల్లభాయిని బోల్చవలసి వచ్చిన వారిలోఁ జాలవ్యత్యాసము కలదని స్పష్టపడఁగలదు. వ్యత్యాసమేకాదు, అసలు ప్రవృత్తిలోనే భేదముగలదు. ప్రవృత్తితో పాటు తాత్త్విక భేదమునుగలదు. గాంధీజీ సాధకుఁడు. సత్యము, ఆత్మసాక్షాత్కారము నాయనలక్ష్యములు. ఇందుచే సహజముగా నాయన జీవన మనావృతము, బహిరంగము. ఈ సత్య సాధన సందర్భములో నాయనకు సహకారులైన యల్పాత్యల్ప విషయముల నరమరలేక యాయన వెల్లడించును. సాధారణమానవుఁ డేవిషయములను జెప్పుటకుఁ గంపించునో, యట్టి విషయములనే యాయన యెట్టి సంకోచములేకుండ స్వీయసత్య సాధనకు సహాయకారులైనచోఁ జెప్పును. ఇతరులచే గౌరవ పూర్వకముగా నీయఁబడిన స్వల్పవస్తువును గస్తురిబా తా నుంచుకోఁ దలచినప్పు డామెయెడలఁ దాను బ్రవర్తించినవిధము