పుట:2015.329863.Vallabaipatel.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

147

ముగాఁ గలియును. లోకమాన్యుని సిద్ధాంతము 'శఠంప్రతి శాఠ్యం' - ఎదిరి యెట్టిపద్ధతి నవలంబించిన నట్టిపద్ధతియే యవలంబించవలెనని యాయన సిద్ధాంతము. వల్లభాయి సిద్ధాంతముగూడ నట్టిదే. గాంధీజీ ప్రభావమువల్ల నది చాల సున్నితమైనది. కాని సిద్ధాంత మదియే. తిలక్‌సిద్ధాంతముపైన గాంధీజీ, ప్రభావము ప్రసరించుటవల్లఁ జేదుమందుకుఁ బంచదార పొదిగినట్లయినది. గాంధీజీ సిద్ధాంతము 'శఠం ప్రతి సత్యం.' రాలఁగొట్టినవారి వెన్నఁగొట్టవలయును. ఈ సిద్ధాంతము నాయన స్వీకరించినాఁడు. ఇది శ్రేష్ఠమైనదనికూడఁ దలఁచును. కాని యాయన సహజస్వభావమునకు గాంధీజీ సిద్ధాంత మనుకూలపడలేదు. ఆయన జీవనములోఁ గలియ లేదు. తీర్థమునకుఁ దీర్థము. ప్రసాదమునకుఁ బ్రసాదముగా నవి విడివడిపోయినవి. ఆయన దానిని స్వీకరించెనుగాని, గాంధీజీవలె నీసాధనలో నాయన యాత్మ పరిపూర్ణమై వికసించలేదు. ఆయనపరిస్థితి, బుద్ధి, వివేకములలో నాయన గాంధీజీ వైపునకు మ్రొగ్గును. ఆయన ప్రకృతియో -ఆయన స్వభావము, ప్రవృత్తి, లోకమాన్యునివైపుకుఁబోవును. ఈసంగతి సందర్భము లన్నియు సమీక్షించినయెడల నాయనలో లోకమాన్యుని గుణములుగాని గాంధీజీ గుణములుగాని లేవు. వీరి యుభయగుణముల సమ్మిశ్రణమే వల్లభాయి. ఆయనలో వా రిరువురి గుణములలోఁ గొన్ని యున్నవి. కొన్ని లేవు.

లోక మాన్యత్వము

ఒక్కక్షణము గాంధీజీ లోకమాన్యులతోఁ బోల్చి చూతము. లోకమాన్యుని యసాధారణవిద్వత్తు వల్ల