పుట:2015.329863.Vallabaipatel.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

146

వల్లభాయిపటేల్

నిప్పులోఁ గడ్డిపెట్టి బాగుగాఁ గాలనిచ్చి దగ్గరనున్న యొకవ్యక్తి కిచ్చి పుండుపైని బెట్టుమని చెప్పెను. ఆ కడ్డీ చేతఁబుచ్చుకొన్న మనిసి యా లేతకుఱ్ఱవానిని గాల్చుటకు సంశయించుచుండెను. అంతట వల్లభాయి కుపితుఁడై యిట్లన్నాఁడు. "ఏమిటి! అట్లాలోచించుచున్నావు. కడ్డీ చల్లారిపోవుచున్నది. నీవల్లఁగాకపోయిన నది యిటు లిమ్ము. నేనే కాల్చుకొందు"నన్నాఁడు. ఆమాట విని యాయన యాశ్చర్యపడినాఁడు.

కడ్డీ యెప్పుడును వేడిగానే యుండును.

ఈ వీరపురుషుని హృదయములో నా కడ్డీ యెప్పుడును జల్లబడనేలేదు. ఆ కడ్డీ చల్లపడుట చూడఁగానే యాయన దడదడఁ గొట్టుకొనును. ఎంతవఱకు నది వేడిగా నుండునో, యెంతవఱకు వాతావరణము తుపానుతోఁ గూడుకొని యాపదల కాటపట్టుగా నుండునో, యెంతవఱకు నగ్ని నలువైపుల ముట్టుకొని యాకాశమున కంటుకొనునో, యంతవఱకు నాయనకు స్వర్గము. ఆ తుపా నాగి, యగ్ని చల్లారిన, నాయన యానంద మంతరించును. అగ్ని పర్వతమునుండి యగ్ని కణములు బయలుదేరునట్లుగనే, వివిదవస్థలో నాయన నోటినుండి వాగ్రూపమైన యగ్నికణములు వెలువడును.

గాంధీజీ లోకమాన్యునిగుణములు

వల్లభాయి గాంధీజిని గురువుగా గ్రహించినమాట సత్యమే. ఆయన వివేక మట్లు వరింపఁజేసినదికాని, యాయన తత్త్వము, నాయనప్రేరణ, ప్రకృతి, లోకమాన్యునితో నధిక