పుట:2015.329863.Vallabaipatel.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[19]

వల్లభాయిపటేల్

145

నాయన నివురుకప్పిన నిప్పువలె నుండును. యుద్ధసమయములో నెఱ్ఱ చింతనిప్పువలె నుండును. అపాయములయెడల నాప్యాయము. ఆయన యనుక్షణమును నపాయముల నాప్యాయముగా నాలింగనమొనర్చును. విపత్కరకార్యములను విలోకించుటతోడనే యాయనయుల్లము వికసించును. వేయేల ? ఆయన నిప్పుతో చెల్గాట లాడఁగోరును. బార్డొలీ సంగ్రామ ప్రారంభకాలమున నాయన కిసాన్‌సభలో నిట్లు విస్పష్ట పఱచినాఁడు. "నాతో నెవరును గ్రీడించజాలరు. ఆపదగాని భయము గాని లేని కార్యములో నేను బ్రవేశించనే ప్రవేశించను. ఆపదల నాహ్వానించువారికి నేను సహాయపడుట కనుక్షణము సిద్ధముగా నుందును.

"కడ్డీ చల్లపడుచున్నది."

ఆయన కీ స్వభావ మసహాయోద్యమకాలమునందే యాకస్మికముగా నేర్పడినదికాదు జన్మాదారభ్య యాయన యట్టివాఁడే. కష్టము లాయనను వంచజాలవు. భయ మాయనను భయపెట్టఁజాలదు. నేఁడేకాదు, బాల్యమాది యాయన నిర్భయుఁడు. ఆయన నిర్భయత్వమునకు బాల్యములో నీ దిగువ ఘటన తార్కాణము కాఁగలదు. ఆయనకుఁ గక్షమునఁ గుఱుపు లేచినది. మన పల్లెటూరు వైద్యులకు సర్వరోగనివారిణి రక్షలేగా! ఆ యూరి వైద్యుఁడు కడ్డీ బాగుగాఁ గాల్చి యా కుఱుపుమీదఁ బెట్టిన వెంటనే యెగిరిపోవునని చెప్పినాఁడు. బాలుఁడైన వల్లభాయి యా వైద్యుని మాటలు శిరసావహించి యావిధముగాఁ జేయుటకు సంకల్పించినాఁడు. కణకణలాడు