పుట:2015.329863.Vallabaipatel.pdf/151

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
144
వల్లభాయిపటేల్


జీవన సమీక్ష

యోధుఁడు

వల్లభాయ్ జీవితములోఁ బ్రప్రథమముగాఁ గనుపించునది యాయన వీరత్వము. బాల్యమునుండి వార్ధాక్యములోఁగూడ నాయన మహావీరుఁడుగాఁ జూపట్టును. భయమనునది యెట్టిదో యెఱుఁగని నిర్భయుఁ డాయన. ఆయన మహాత్మునికిశిష్యుఁడే కాని మహాత్మునివలె నాయన సాధకుఁడు, బోధకుఁడుకాదు. ఆయన యోధుఁడు. ఈ విధముగానే యాయన జీవితరంగములో విహరించినాఁడు. ఆదర్శసత్యాగ్రహివలె నాయన శూన్యములో మిళితము కాఁజాలడు. ఆయనలో సత్యాగ్రహి యొక్క యజాతరత్రుత్వములేదు. కాని వీరోచిత క్షమాశక్తి గలదు. పోరాట మాయనకు సహజగుణము. యుద్ధముచూడఁ గనే యాయన కద్భుతభావావేశము గలుగును. భుజము లుప్పొంగును. రాజపుత్రవీరులవలె యుద్ధమాయనకుఁ గేళీవిలాసము. యుద్ధసమయములో వల్లభాయిని జూడఁదగినది. ఆ సమయములో నాయన ఛాతీ విప్పారును. భుజము లుప్పొగును. హృదయ ముత్సాహపడును. వాణి యగ్నికణములవలె నుండును. యుద్ధసమయమున నాయ మధ్యందిన మార్తాండునివలె నుండును. యుద్ధసమయమున, యుద్ధానంతరమున నాయనలో విశేష వ్యత్యాసము కన్పించును. ఆయన జీవిత రహస్యము మనము చక్కగా గమనించఁగలము. యుద్ధ సమయములో వల్లభాయికిఁ బ్రశాంత సమయములో వల్లభాయికి, యేమియుఁ బోలికయే కన్పించదు. సాధారణ పరిస్థితులలో