పుట:2015.329863.Vallabaipatel.pdf/150

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

143

బ్రత్యేకముగా ననుచరవర్గము నేర్పాటు చేసికొనుట కాయన నిరాకరించెను. ఇది శోచనీయము. రాజకీయముగాఁ దప్పే యైనను నున్న పరిస్థితి యది. దూరదృష్టి, చాకచక్యముగల సర్దార్ పటేల్‌వంటి యనుష్ఠాన రాజకీయవేత్త, తన తరువాతఁ దన స్థాన మాక్రమించగల యనుచరవర్గము నెందుకుఁ దయారు చేయుటలేదో బోధపడుటలేదు. ఇప్పుడు ప్రసిద్దిలోనున్న కాంగ్రెసు నాయకులందరు ముసలివారు. త్వరలోనే వీరు గట్టిగాఁ బనిచేయ నసమర్థు లౌదురు.

అందువలన భవిష్యత్తు చాల చంచలముగా ననిశ్చితముగా నున్నది. సమయమునకుఁ దగినట్లు వ్యక్తులుకూడ నుద్భవించఁగలరని యాశించవలెను. కాని యీ విషయమే భవిష్యద్రాజకీయవిషయములలో ముఖ్యమగు పాత్ర నిర్వహింపనున్నది. ఈ విషయములోనే గాంధీజీ ప్రజానీకపు వాస్తవాద్వితీయ నాయకుఁడుగాఁ గన్పించుచున్నాడు. తన యుత్తేజనకర శిక్షణలద్వారా యాయన మెరికలవంటి యనుచరులను దయారుచేయఁగలిగినాఁడు. వారే యీనాఁడు దేశమునకు నాయకత్వము వహించియున్నారు. ప్రస్తుత నాయకు లందరు నాయనవద్ద నేర్చుకొన్న వారేగాని, యీ విషయములో నాయన విధానమును వీరు సాగించ లేకపోవుచున్నారు.