పుట:2015.329863.Vallabaipatel.pdf/149

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
142
వల్లభాయిపటేల్

లించఁబడదు. వారు సఫలులై ఫలితములనైనఁ జూపించవలసి యుండును, లేదా వైదొలఁగవలసి యుండును. నెహ్రూ పటేలుల తప్పులను బ్రజలు - బహుశః యలవాటు ప్రకారమే కావచ్చును-సహించెదరు. అంతేకాని వారితరువాత వచ్చెడు వారి తప్పులను సహించరు. ఈ ముఖ్యవిషయములఁ గాంగ్రెసు పార్టీ ముఖ్యముగా భవిష్యత్తునుగుఱించి యాలోచించుచున్నప్పుడు జ్ఞాపక ముంచుకొనవలెను.

భవిష్యత్తు విషయములోనే యీ యిద్దరు నాయకులొక ముఖ్యవిషయములో నసమర్థులైపోయిరని చెప్పక తప్పదు. తమతర్వాత తమ స్థానముల నాక్రమించి కార్యక్రమమును జయప్రదముగా సాగించగల సమర్థులగు "ద్వితీయశ్రేణి" నాయకులను వీరు తయారు చేయలేకపోయిరి. తమతర్వాతఁ దమ స్థానముల నాక్రమింపఁగల సమర్థులగు ననుచరులకుఁ దమ పద్ధతులలో శిక్షణనీయక వీరు నిర్లక్ష్యము చేయుచున్నారు.

"నా తదనంతరము బూడిదే" యన్న యుద్దేశమైనట్లు కనిపించుచున్నది. దేశము క్లిష్టపరిస్థితిలో నుండుటవలనను దేశములో వీ రిద్దరికి నొక ప్రత్యేకస్థాన ముండుటవలనను నీ లోప మత్యవసరకాలములో విషమపరిణామములకు దారి దీయగలదు. వాస్తవమునకు దేశమునకుఁ బ్రస్తుతప్రభుత్వమునకు విరోధులైనవా రీ లోపము తమకు గొప్ప సహాయకారి కాఁగలదని యాశించుచు నందు కెదురుచూచుచున్నారు. దీని నాధారముగాఁ జేసికొని ప్రణాళికలుకూడ నేర్పాటుజేసికొనుచున్నారు.

నెహ్రూవైఖరి సులభముగానే బోధపడఁగలదు. తనకుఁ