Jump to content

పుట:2015.329863.Vallabaipatel.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[18]

వల్లభాయిపటేల్

137

ప్రతివ్యక్తిని, సంఘటనను, పార్టీ లాభనష్టముల దృష్ట్యానే యాయన పరిశీలించును. ఆయన చుట్టు నెప్పుడును వినయ విధేయతలతో వర్తించు ననుచరులు మూగియుందురు.

ఈ విరుద్ధశక్తులను సమన్వయించి నడిపించుకొని వచ్చుచున్నది భారత భాగ్యవిధాత గాంధీజీ. ఆయన యసమాననాయకుఁడు. పటేల్ నెహ్రూలవంటి యనుచరులను గూడగట్టుకొని రాఁగలఁడు. వీ రిద్దరు నాయనను బూజించి, గౌరవించెడువారనుట నిస్సందేహము ఆదర్శకతపట్ల నెహ్రూకుఁ గల శ్రద్ధవలననే గాంధీజీ కాయనపై వాత్సల్యము ప్రబలెను. ఆయన నైతికభావనప్రకారము వ్యక్తిలో వ్యక్తిత్వము ముఖ్యమైనది. అందువలననే నెహ్రూ యాయనకుఁ బ్రియతముఁడయ్యెను. గాంధీజీకిఁ బటేల్‌తోఁగల సంబంధములు కూడ నిట్లు దృఢతరమైనవే. సర్దా రాయనకుఁ దొలిగా లభించిన యాంతరంగికానుచరులలో నొకఁడు. ఆయన శక్తిసామర్థ్యములను గాంధిజీ గుర్తించి యాయనపట్ల నవిరళవాత్సల్యమును గలిగియుండెను. పటేల్‌పట్ల గాంధీజీ కత్యంతవిశ్వాస ముండుట వలననే యాయన చాలకాలమునుండి గాంధీజీకిఁ "గుడిచేయి"గాఁ బరిగణింపఁబడుచుండెను. సర్దార్‌కూడఁ బూర్తిగా గాంధీజీకి దోసిలొగ్గెను.

కాని వీరిద్దరు గాంధీజీతో ననేకపర్యాయము లేకీభవించలేదు. అంతర్జాతీయత, సోషలిజము మొదలగువానిపైఁ బండిట్ నెహ్రూ బాహాటముగానే గాంధీజీ నెదిర్చెను. పటేల్ తన చతురత, వాస్తవికదృక్పథములతో ననేకపర్యాయము లాయన యాదర్శాత్మకవిధానములను బ్రతిఘటించెను. కాని