వల్లభాయిపటేల్
127
యాలోచించవలసివచ్చు చున్నది. ఏనాటికైన, మనము సాధించ వలసినది రాష్ట్రములకు - సంస్థానములకు రాజ్యాంగరీత్యా యేమి, యన్యరూపములలో నేమి, యెట్టి భేదములేకుండఁ జేయుటయే. (ఆంధ్రప్రభ. 1948 మే 31.)
జమీందార్లు, సంస్థానాధీశులు, బ్రిటిషువారిచే నిలుపఁ బడిన పరపీడకులు. వారున్నంతవరకు వీరుండిరి. వారితో వీరికి నంత్యమే. అయితే యాపని మనపరిస్థితుల ననుసరించి పటేల్ చేయుచున్నాఁడు.
ఇండియన్ యూనియన్ లో సంస్థానముల ప్రవేశ మను విజయమెట్టిదో భారతప్రభుత్వము ప్రకటించిన "వైట్ పేపరు" వల్ల విదితము కాఁగలదు.
"ఇండియన్ యూనియన్‌లో నిండియా సంస్థానములు ప్రవేశించుట యపూర్వసంఘటన. సంస్థానముల పూర్వచరిత్ర పరిశీలించిన దీని ప్రాముఖ్యము విదితమగును. కడచిన యేఁబది యేండ్లుగ సంస్థానములు బ్రిటిష్ భారతప్రజానాయకులకు మెట్టరాని కోటలుగాఁ గొఱుకరాని కొయ్యలుగ నుండినవి. సంస్థానములలో స్వాతంత్ర్య ప్రజాస్వామ్యోద్యమములు చొఱఁ జాలనట్టి యినుపకోటలు కట్టఁబడినవి. అభివృద్ధినిరోధకులకు, విధ్వంసకులకు, సంస్థానములు ఠావులై యుండెడివి. ఒకటి కాక పది రాజస్థానముల నిర్మాణమునకు సన్నాహములు జరిగినవి. విభజనవల్లను, సంస్థానముల మంకుపట్టువల్లను, భారత ప్రభుత్వ పతన మనివార్యమని పలువురు భావించిరి.
"రాజకీయస్వేచ్ఛయే యాదర్శముకాదు; అది ప్రజాభ్యుదయమునకు సాధనము మాత్రమే. సంస్థానప్రభుత్వము