పుట:2015.329863.Vallabaipatel.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

126

వల్లభాయిపటేల్

"నిజమున కిండియా స్వరాజ్యము పొందిన మఱుక్షణములో నందరు సంస్థానాధిపతులను బదవీభ్రష్టులను జేయవలసినది; రాష్ట్రములకు, సంస్థానములకు మధ్యగల యన్ని సరిహద్దు గీతలను చెఱిపి వేయవలసినది. అయితే యది విప్లవాత్మక చర్య. బ్రిటన్‌తో నొడంబడికద్వారా కాకుండ, జాతీయవిప్లవ ఫలితముగా స్వరాజ్యము సిద్ధించినట్లయిన బహుశః అంతే జరిగి యుండును.

"సంస్థానముల నొక్కసారిగా రద్దుపఱచివేయుట దుస్సాధమైన పరిస్థితి. సంస్థానములలో వారు ప్రస్తుత మవలంబించుచున్న విధానమే శరణ్యము.

"మనము కోరుచున్నంత త్వరగాఁ గాకపోయినను, గోరుచున్న రూపములోఁ గాకపోయినను - ఈ విధానము మొత్తముపై సత్ఫలితముల నిచ్చుచున్నది.

"ఈ విధానము దాదాపు 500 సంస్థానములను రెండేండ్లలోపల నయిదారింటికిఁ దగ్గించినది. అందువల్ల దీనిలోఁ గొన్ని లోపములున్నను నిది మొత్తముపై హర్షించఁ దగినట్టిదే కాఁగలదుగదా! సమ్మేళన విలీనీకరణ ద్వివిధ కార్యక్రమమును సంస్థానశాఖవా రనుసరించుచు వచ్చినారు. ఈకార్య క్రమములో రెండవభాగమే యుత్తమమైనట్టిది. సమ్మేళనద్వారా సంస్థానముల సమస్య తెగుటకుమాఱు క్రొత్తచిక్కులు కొన్ని యేర్పడుచున్నవికూడ. ఇందువల్లనే మధ్య యూనియనును విశాల రాజస్థాన్‌లోఁ జేర్చి వేయవలసి వచ్చినది. మధ్య భారత్‌ను సి.పి. యు.పి. లలో గలిపివేయవలయునా యని