వల్లభాయిపటేల్
125
బాధ్యతాయుత ప్రభుత్వము
సంస్థానముల విషయములో బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన సందర్భములోఁ గేంద్రప్రభుత్వము చూపిన శ్రద్ధకు నైజాం విషయమే నిదర్శనము. మైసూర్, తిరువాన్కూర్ ప్రజాసమరములకు నైతికసహాయ మిచ్చినది. గ్వాలియర్, ఇండోర్, బరోడా, జోధపూర్, ఉదయపూర్, బికనీర్ సంస్థానము ల విషయములోఁ గేంద్రప్రభుత్వము తన యాశయమును సాధించినది.
చేరనన్న కాశ్మీర్ శరణన్నది. స్వతంత్రముగా నుండునన్న తిరువాన్కూర్ తిక్క కుదిరినది. తన ప్రత్యేకతను బ్రకటించుకొంద మనుకొన్న నైజాముకుఁ గోఱలుతీసిన పాముగతియే పట్టినది.
మైసూర్, జోధపూర్, జయపూర్ మొదలగు కొన్ని సంస్థానములు ఇండియన్ యూనియన్‌లోఁ జేరినప్పటికి స్వతంత్రముగా నుండుటకు నిశ్చయించుకొన్నవి.
564 సంస్థానములలో 544 ఇండియాలో నున్నవి. వీని మొత్తము పాకిస్థాన్ మొత్తముకంటె నధికము. అనగా 8,88,00,000.
పటేల్ సాధించినదంతయు మితవాదకార్యమే యని తలచెడివారు లేకపోలేదు. దానికి సమాధాన మాంధ్రప్రభ యిచ్చినది గమనింపదగినది.