పుట:2015.329863.Vallabaipatel.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

117

సంపన్నుఁడు, మఱొకఁడుండిన నెహ్రూను బదభ్రష్టుని జేయుటకుఁ గృషిచేసియుండెడివాఁడే. క్రమశిక్షణాదీక్షాదక్షుఁడై వల్లభాయి 1950 అక్టోబరు 2 వ తేదీని ఇండోర్‌లో నెహ్రూతో విభేదముల ప్రసక్తిఁదెచ్చి పలికిన పలుకులే యిందుకు నిదర్శనము. ఆయన యిట్లన్నాఁడు.

"గాంధీజీ నడిపించిన స్వాతంత్ర్య భారత సైన్యములో మేమందరము సైనికులమే. డిప్యూటీ ప్రధాని నని నే నెప్పుడు ననుకోలేదు. ఆవిషయము నెన్నడును బాటించనేలేదు. రాజకీయరంగములోఁ బ్రధానమంత్రియైన పండిట్ నెహ్రూయే నాయకుఁడు. ఇందుకుఁ దిరుగులేదు. బాపూ బ్రతికియుండఁగానే తనకు నెహ్రూయే వారసుఁడు కావలయునని యెన్నుకొన్నాఁడు.

"అంధకార బంధురమైన యీ జగతికిఁ దాను జూపించిన దివ్యజ్యోతిని పండిట్ నెహ్రూయే పట్టుకొనఁదగినవాఁడని బాపూ పదేపదే స్పష్టముగా జెప్పినాఁడు.

"అందువల్ల భారతజాతిపిత గాంధీజీ యాశయమును నెఱవేర్చుట, యాయన భావములను గౌరవించుట మన విధ్యుక్త ధర్మము - బాపూజీ యాశయములను హృదయపూర్వకముగా సమర్థించనివారు దైవమునకే యపచారము చేయు చున్నట్టు లెక్క.

"నేనును గాంధీజీ సైనికులలోనివాఁడనే. బాపూజీ యాశయములను సయితము వెన్నుపోటు పొడుచు కిరాతకుఁడనుగాను. నిజమునకు నే నగ్రనాయకులలో నొకఁడనని యనుకొనుటలేదు. రాజకీయరంగములో నాకుఁగూడ స్థాన