116
వల్లభాయిపటేల్
లును, దేశములో మిక్కిలి పలుకుబడిగల నెహ్రూ పటే ళ్లిరువురు నీ బ్రిటిషువారి పరిపాలన, మహమ్మదీయుల ద్వేషాగ్ని నుండి తప్పించుటకు దేశవిభజన కంగీకరించిరి. ఈ స్వాతంత్ర్య దేవత ప్రతిదేశమున నెంతో రక్తము బలిగొనినగాని ప్రత్యక్షము కాదాయెను - మన మీ దేవతకు రక్తము బలి యీయకయే స్వాతంత్ర్యము పొందితిమి. కాని యా దేవత యూరకుండునా ? లక్షలకొలది జనుల రక్తమును గ్రోలుటే గాక భారతదేశపిత, యహింసాధర్మబోధకుఁడైన గాంధీ మహాత్ముని రక్తమునుగూడఁ జవిచూచినది.
గాంధీజీ నిర్యాణమునకు లోకమంతయు దద్దరిల్లినది. భారత దేశమంతయుఁ గన్నీరు మున్నీరుగాఁ గార్చెను. దేశపిత హత్యావార్తను విని యెందరో యసువులువాసిరి. స్వాతంత్ర్య దేవత యిప్పటికైనను దృప్తిచెందెనా?
గాంధీజీ నిర్యాణముచే వల్లభాయి తల్లిని గోల్పోయిన బాలునివలె నాయెను.
గాంధీజీ జీవించి యుండఁగనే భారతభాగ్యవిధాతలుగా నున్న నెహ్రూ, పటేలులలో ననైక్య మేర్పడినదని విని యాయన యెంతయో విచారించెను. తమలో నట్టి యనైక్య మేమియులేదని వారిరువురు వెలిబుచ్చిరి.
ఈ యిరువుర మధ్య విభేధము కల్పింప కొందరు కృషి చేసిరి. వల్లభాయిపటేల్ నెహ్రూకన్న వయస్సునఁబెద్ద. ఇంతే గాదు, సర్వశక్తి సంపన్నుడు, అయినను గాంధీజీ వారసుని నాయకత్వము క్రిందనే యాయన నిస్సంకోచముగను మన స్ఫూర్తిగను, బనిచేయుట ప్రశంసనీయము, ఇటువంటి శక్తి