పుట:2015.329863.Vallabaipatel.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

115

"మనము నీటికన్న నిర్లక్ష్యముగ ధనమును వెచ్చించు చున్నాము. 55 కోట్ల రూప్యములు చెల్లించుటతో గాంధీజీ సంతొషించునెడ నాపని మాకు సమ్మతమే. గాంధీజీ క్రోధమున కతీతుఁడు. మన మందరము నాయన స్థాయి యందుకొనినఁ బోలీసులు, సైనికులు, చట్టములు, మొదలగునవి యవసరమే లేకుండును."

పాకిస్థాన్ దౌర్జన్యములకుఁ బ్రతిగ భారతదేశమున హిందువులు కొందరు ముస్లిములను హింసింపఁ దొడఁగిరి. అహింసావాదియగు గాంధీ దీని నరికట్టఁజొచ్చెను. పాకిస్థాన్‌ను గాంధీజీ బుజ్జగించుటవల్లనే హిందువులకు సర్వనాశనము కలుగు చున్నదని కొందరు హిందువులు భావింపసాగిరి. ఇది క్రముగఁ బెరిగెను. పాకిస్థాన్‌నుండి వచ్చిన కాందిశీకులకును, వారియెడ నభిమానము చూపించు నితరులకును, మహాత్మునియెడల ద్వేషభావ మేర్పడెను. ఈ దుష్పరిణామ ఫలితముగ మహాత్ముఁడు ఢిల్లీలో 1948 జనవరి 30 వ తేదీ సాయంకాలమునఁ బ్రార్థనాసమయమున నుపన్యసించుచుండ, గోడ్సే యను మహారాష్ట్ర బ్రాహ్మణయువకుఁడు తుపాకీ ప్రేల్చగా నాయన 'హా - రామా'యనుచు నసువులఁ బాసెను.

గాంధీజీ జిన్నాతో మన మన్నదమ్ములమువలె విడిపోయెదమని యెంతో బుజ్జగించి చెప్పెను. ఆ మహమ్మదాలీ జిన్నా ద్విజాతి సిద్ధాంతమును నెలకొల్పి మహమ్మదీయులలో ద్వేషానలము రెచ్చగొట్టి - మనము విరోధులమువలె విడిపోవుదమని మహాత్మునితో వెల్లడించెను. "గాంధీజీ యీ విభజన సిద్ధాంతమున కిష్టపడఁడాయెను. గాంధీజీ శిష్యులలోఁ బ్రముఖు