పుట:2015.329863.Vallabaipatel.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వల్లభాయిపటేల్

107

అంతట వైస్రాయి కేంద్రశాసనసభలోని కాంగ్రెసు పక్షనాయకుడు భూలాభాయిదేశాయ్, ముస్లింలీగు నాయకుఁడు లియాకత్ ఆలీఖాన్‌గారలతో రహస్యముగా రాజీ మాటలు సాగించెను. ఈ రాజీపద్ధతిలోఁ గాంగ్రెసులీగులకు సరి సమానప్రతిపత్తి యిచ్చు పద్ధతిని కాంగ్రెసువారితోఁగలసి కేంద్రప్రభుత్వములో లీగువారు మంత్రులుగ నుండి పరిపాలన సాగించుటకును, గాంగ్రెసువారిని జైలునుండి విడిపించుటకును నేర్పాటు గావింపఁబడెను.

భూలాభాయిదేశాయి 1945 డిశంబరు 30 వ తేదీని అహమ్మద్ నగర్‌కోటకు వెళ్ళి సర్దారు వల్లభాయిని గలిసికొని సంభాషించెను. ఈ విధముగాఁ గాంగ్రెసు నాయకులందరు నాయన ప్రయత్నమువలనఁ గారాగారవిముక్తులైరి.

భారత దేశ రాజకీయ సమస్యలఁ బరిష్కరింపఁదలచి యప్పటి రాజ ప్రతినిధి వేవెల్ ప్రభువు 1945 జూన్ 4 వ వారమున భారతదేశమునందలి రాజకీయపక్షముల ప్రతినిధులను సిమ్లానగరమున కాహ్వానించెను. ముస్లింలీగు అధ్యక్షుడు జిన్నా హిందువులతో సమాన ప్రాతినిద్య మీయవలెనని పట్టు పట్టెను. దీనికి కాంగ్రెసువా రంగీకరించనందున సిమ్లాసభ విఫల మయ్యెను.

1946 సంవత్సరమున భారతదేశమున జరిగిన శాసన సభల యెన్నికలలోఁ గాంగ్రెసువారి కఖండ విజయము చేకూరెను.

1946 మార్చిలో బ్రిటిషు ప్రభుత్వము సర్‌శ్టాఫర్డు