పుట:2015.329863.Vallabaipatel.pdf/112

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[14]

వల్లభాయిపటేల్

105

తాత్కాలిక ప్రభుత్వము

జర్మనీనియంత హిట్లర్ స్వీయరాజ్య విస్తృతికిగా నిరుగు పొరుగున నల్పరాష్ట్రముల నాక్రమింప సాగెను. ఇది క్రమముగ నభివృద్ధిపొంది తృతీయప్రపంచసంగ్రామముగఁ బరిణమించెను. బ్రిటిషువారు 1939 సెప్టెంబరునెలలో జర్మనీపై యుద్ధము ప్రకటించిరి.

భారతదేశమునందుఁగూడ యుద్ధ సంరంభ మేర్పడెను. ఈ సంగ్రామలక్ష్య మేమని కాంగ్రెసుప్రభుత్వము లడిగెను. బ్రిటిషువారు మిన్నకుండిరి. కొన్నిరాష్ట్రముల గవర్నర్లు కాంగ్రెసు మంత్రివర్గములకుం దెలుపకయే యుద్ధకృషి చేయ సాగిరి. దీని కంగీకరించక కాంగ్రెసు మంత్రులు, శాసనసభ సభ్యులు తమపదవులను వీడిరి.

తనలక్ష్యశుద్ధికై కాంగ్రెసు గాంధీజీ నాయకత్వమున 1940 సంవత్సరమున వ్యష్టిసత్యాగ్రహ మారంభించెను. యుద్ధమున భారతీయులు బ్రిటిషు ప్రభుత్వమున కెట్టి సాయము చేయఁగూడదని వెల్లడించెను.

ప్రపంచసంగ్రామము తీవ్రమాయెను. జర్మనీ, ఇటలీ, జపాను, దేశములకు జయపరంపర లభించుచుండుట చేతఁ గాంగ్రెసుతో నేదోవిధముగా రాజీపడఁదలచి బ్రిటిషు ప్రభుత్వము 1942 జులైలో సర్‌శ్టాపర్డూక్రిప్సును మనదేశమునకు రాయబారమంపెను. కాంగ్రె సాయన ప్రతిపాదనమును దిరస్కరించి బ్రిటిషువారు భారతమునుండి వైదొలఁగుటే తన