పుట:2015.329863.Vallabaipatel.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

వల్లభాయిపటేల్

నేటి దేశనాయకులలోఁ గొందరి కెంతటి యున్నత భావములున్నను, నుత్తమలక్ష్యము లున్నను నీ వజ్రసంకల్పము లేదు. ఈ కార్యదక్షతలేదు. నేటి మన దేశపరిస్థితులనుబట్టి యన్నిటికంటె నెక్కువగాఁ గావలసినది వజ్రసంకల్పమే. కార్య దక్షతయే. కాఁబట్టి వీనిని ప్రదర్శించుచున్న పటేల్ నాయనను విద్వేషించువారుకూడ మెచ్చుకొనక తప్పనిసందర్భములు కొన్ని వచ్చుచున్నవి.

అట్టి యొక సందర్భమే "చర్చిల్ నోటికిఁ దాళమువేయించకపోయిన జాగ్రత్త సుమీ!" యని యట్లీ ప్రభుత్వమును హెచ్చరించుచు నాయన చేసిన ప్రకటన.