పుట:2015.329863.Vallabaipatel.pdf/110

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
103
వల్లభాయిపటేల్

గలుగుటలోని రహస్యమిదే. దేశములో శాంతి భద్రతల రక్షణ కాయన యనుసరించిన పద్ధతులు మనకు నచ్చక పోవచ్చును. సంస్థానముల విషయములో నాయన యమలు జరిపిన విధానములు మనకు రుచించక పోవచ్చును.

ఇన్‌ఫర్‌మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ శాఖ పరిపాలన సందర్భములోనైన నాయన ధోరణిని మనము విమర్శించ వచ్చును. కాని యీ యన్నింటిలోఁ దానేమి చేయదలఁచు కొన్నాఁడో దాని నాయన నిక్కచ్చిగాఁ జేసినాఁడు. కేవల మటునుండి వఱకుకొని వచ్చినాఁడు.

అందువల్లనే యాయన భావములతో నేకీభవించలేక పోవుచున్నవారుకూడ నాయన భల్లూకపట్టును బ్రశింసింపవలసి వచ్చుచున్నది. ఆయన విధానములను విమర్శించుచున్న వారుకూడ నాయన కార్యకుశలతను గాదనలేక పోవుచున్నారు. ఆయన దేశమును దప్పుదారిని బెట్టుచున్నాడని నమ్ముచున్న వారుకూడ నాయన గుడినేకాక గుడిలోని లింగమునుగూడ మ్రింగఁగల పాటివాఁడని యొప్పుకోవలసి వచ్చుచున్నది.

ఆయనపట్ల మీకు భక్తి యుండవచ్చును. లేకపోవచ్చును. కాని యాయననుజూచి భయపడకతప్పదు. ఆయన కోరున దైనను మీ హృదయముకాదు. మీ విధేయతయే. ఆయనను మీరు ప్రేమించవచ్చును, ప్రేమించక పోవచ్చునుగాని యాయన రెండువైపులఁ బదనున్న కత్తిని బోలినవాఁడని గుర్తించక తప్పదు. ఆయన వాంఛించునదైన మీ ప్రశ----- తనవని చక్కఁబడుటయే.