పుట:2015.329863.Vallabaipatel.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

వల్లభాయిపటేల్

రాజీకి రప్పించిన ఖ్యాతి పటేలునకే తగినది. భారత కర్షక లోకములోఁ గల చైతన్యమును బ్రపంచమునకుఁ చాటిన కర్షక విప్లవమూర్తి.

గ్రంథరచన చేయకయే స్వీయసంభాషణపాటవము వలననే పండితులు కవులు చేయజాలని భాషాభివృద్ధి గుజరాతీ భాషకుఁజేసిన భాషాసేవకుఁడు. “కదనరంగమున వలెనే కౌన్సిలు రంగమునఁగూడ బ్రభుత్వమును గాంగ్రెసుపక్షము పరాజయము నొందించఁగలదని ఋజువుచేసిన ఖ్యాతియుఁ బటేలునకే దక్కినది.

కాంగ్రెసువారి కీయనయందున్న భయభక్తులు మఱి యొకని యందు లేవు. కాంగ్రెసు నుత్తమ శిక్షణగల సంస్థగాఁ జేసినది పటేలు. సర్దా రనఁగా శిక్షణ, శిక్షణ యనఁగా సర్దారు, ఇవి రెండు నేకార్థబోధకములు - కాంగ్రెసు ప్రెసిడెంట్లు వత్తురు, పోదురు - కాని యా మహాసంస్థ యాజ్ఞల నమలులోఁ బెట్టునది యాయనయే. ఆయన గొప్పదనమున కంతకుఁ గారణ మదియే.

ఆయన కాంగ్రెసు కార్యనిర్వాహకసభ్యుఁడేకాదు - కాంగ్రెసు కిరీటము నౌదలఁ దాల్చిన ప్రజాసేవకుఁడు.

కాంగ్రెసుసూత్రధారులలో నొకఁడుమాత్రమేకాదు; కాంగ్రెసు విధినిర్ణేత.

స్వాతంత్ర్యసమరములో సేనానాయకత్వము వహించుటతోపాటు, స్వతంత్రభారతములో నుపప్రధానిగానుండి భారతజాతీయైక్యమునకు నిరోధకములుగా నున్న స్వదేశ సంస్థానముల నన్నిటిని ఇండియనుయూనియనులోఁ గలిపి సమ