పుట:2015.329863.Vallabaipatel.pdf/109

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
102
వల్లభాయిపటేల్

నెహ్రూ కున్న విశాలాశయములుగాని, విశిష్టలక్ష్యములుగాని యాయనకులేవు. అయితే "యెవరి జీవితమునకైన నైతికవిశ్వాసములు లంగరువంటివి. అట్టి లంగరునుండి నా సహచరులు నన్నీడ్చి వేయుచున్నారని తోఁచినప్పుడు నా మనస్సులోఁ బెద్దతుపానులు రేగినవి. అయినను నేను రాజీచేసి కొన్నాను. అది బహుశః తప్పే కావచ్చును. జీవితపు లంగరును విడిచిపుచ్చుట యే విధముగా నొప్పుగాఁగలఁదని" నెహ్రూ వలె బశ్చాత్తాపము చెందవలసిన యగత్య మాయనకులేదు.

నెహ్రూవలె నాయన చుక్కలలోకిఁ జూడ లేఁడు. అయితే నేలపై నడచుటలో నాయన యడుగులు తడఁబడవు.

నెహ్రూవలె నాయన కిట్టే కోపమురాదు. ఒకసారి కోపము కలిగించినవారిని సామాన్యముగా క్షమించ లేఁడు.

ఒక్కమాటలో నెహ్రూ స్వభావములోఁగల ద్వంద్వములు పటేల్ ప్రవృత్తిలో లేవు. తన కేమికావలయునో యాయనకుఁ దెలియును. దానినెట్లు సాధించవలెనో యాయనకుఁ దెలియును. ఒక్కపనిచేయఁ దలచుకొనిన మొగమోటములకుఁ దావీయఁడు. మెత్తదనమును జూపఁడు. మొఱటుగా నడచుకొనుటకైన వెనుదీయఁడు. ఎవరినైనఁ ద్రోసిపుచ్చగలఁడు. ఎంతకైనఁ దెగించగలఁడు. ఒక్కమాటలోఁ బటేల్ వాస్తవికవాది. వ్యవహారదక్షుఁడు.

ఇండియన్ యూనియన్ మంత్రులలో మరెవ్వరు సాగించ లేక పోయినంతటి కార్యక్రమమును పటేల్ సాగించ