పుట:2015.329863.Vallabaipatel.pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వల్లభాయిపటేల్

5

గాంచి పోలీసు అధికారులకు, మేజిస్ట్రేటులకు సింహస్వప్నమై పట్టిన ప్రతికేసునందు విజయము గాంచినవాఁడు.

గాంధీజీ సాహచర్యముద్వారా జీవితము ప్రజాసేవ కంకితము గావించి గాంధేయులలో సాటిలేనిమేటి యని గణన కెక్కినాఁడు. లెనినుకు స్టాలినెట్లో యీయన గాంధీజి కట్టి శిష్యుడని ఖ్యాతిగాంచినాఁడు.

గోధ్రాలో వెట్టిని దుదముట్టించుటలోను, కెయిరా సత్యాగ్రహములో గాంధీజీకిఁ గుడిభుజముగ సంచరించుటలోను గణుతికెక్కెను.

నాగపుర సత్యాగ్రహ మఖిలభారతోద్యమముగ మాఱి క్లిష్టపరిస్థితి యేర్పడినప్పుడు వల్లభాయి దానిని జయప్రదముగఁ బరిష్కరించి జాతీయపతాకాప్రతిష్ఠను గాపాడెను.

అహమ్మదాబాదు మ్యునిసిపాలిటీ కధ్యక్షుడై తన్నగరాభివృద్ధికిఁ బాటుపడుటయేగాక, దానిని కాంగ్రెసు నగరముగా దిద్దితీర్చిన కార్యదక్షుఁడు.

సత్యాగ్రహసమరములో బార్డోలీరైతులు చూపిన సత్యాగ్రహసాహసములు ప్రపంచేతిహాసములోఁ బేర్కొనఁదగినవి. ఇట్టి మహోదంతము ప్రపంచమునఁ గనివిని యెఱుఁగము. తరతరములనుండి తమ భుక్తములోనున్న భూములను భవనములను స్వస్థానములను వీడి యెనుబదివేల మంది సామాన్యజనము శాంతిసమరములో సర్వత్యాగములు చేసి యష్టకష్టము లనుభవించిరి.

ఈ బార్డోలీ సత్యాగ్రహసమరములో సర్వసేనానాయకుఁడై తుదివఱకుఁబోరాడి బ్రిటిషుసింహమును గజగజలాడించి