పుట:2015.328620.Musalamma-Maranam.pdf/7

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నిర్వహించిన మామక మిత్రులగు కందుకూరు మల్లికార్జునాచారిగారికిని, వందనము లర్పించెదను. మఱియు నెన్నఁడు నన్నుఁజూచి యెఱుఁగనివారయ్యు మల్లికార్జునాచారిగారి ప్రేరణచే విశేష కాలవ్యయమున కోర్చి యీ గ్రంథమును శ్రద్ధతోఁ జదివి యనేక విషయములను సూచించిన దయాశాలురగు బ్రహ్మశ్రీ దుర్భా సుబ్రహ్మణ్యశర్మగారికి మత్కృతజ్ఞతాసూచక నమస్కారములు. పదిమందికిఁ దెలియునట్లు నివేదింపఁ దరుణమబ్బినందున కెంతయు సంతసంబయ్యెడి.

ఆర్యులారా! నేను నిశ్చయముగఁ బండితుఁడనుగాను. మరి పామరుఁడను. బాలుఁడను కావున, నిం దెవ్వియేని దోషములున్నఁజూపి ననుం గృతార్థునిఁ జేయ మీ రెల్లరుఁ బ్రార్థితులు.

ఇట్లు విన్నవించు

సకలజనవిధేయుఁడు,

కట్టమంచి రామలింగారెడ్డి

మద్రాసు,

క్రైస్తవ కళాశాల

మార్చి, ౧౯౦౦