పుట:2015.328620.Musalamma-Maranam.pdf/33

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఊర్మికా, నికర, నిర్ఘోషంబు = ఒప్పుచు, (సరస్సున) మధ్యభూమినుండెడు, పర్వత, సమూహములకు తాకునట్టి, గొప్ప, అలల, గుంపుయొక్క, రొదయు; కూడగా = ఏకముకాగా; దిక్, విదళన వ్యాపార, పారీణమై = దిక్కులను, బ్రద్దలుగొట్టు, పనియందు, దట్టమగు ప్రవేశము కలదయి; ఘోరసరస్సు = భయంకరమైన చెరువు, అలరున్ = ఒప్పుచున్నది.

21. మన్ను = భూమి; మిన్ను = ఆకాశము.

22. పొంగలి = పులగము.

23. జిల్లను = వణకుకలిగించు.

24. తళియల్ = తళిగరూపాంతరమునకిది బహువచనము, తళిగయనగా భోజనపాత్రము. ఇది వైష్ణవసాంప్రదాయానుసారముగా నుపయోగించునప్పుడు దైవమునకు ఆరగింపుగానిడు పిండివంటయను నర్థమగుచున్నది; అనంగ, అరి = మన్మథుని, శత్రువు: ఈశ్వరుడు; ఆతనిశుభాంగి దుర్గ అనంగారి శుభాంగి.

25. కరిముఖుడు = విఘ్నేశ్వరుడు; విశాఖుడు = కుమారస్వామి; చండీశ్వర, భైరవ, వీరభద్రులు = వీరు మువ్వురును ఈశ్వరుని పుత్రులే.

27. తరంగ, భుజములు = అలలను, బాహువులు.

28. మారిమసంగినట్లు = మశూచకము విజృంభించినరీతిని.

29. ముమ్మరము = దట్టము; అఱ = నశింపగా.

31. పుణ్యాంగన = ముత్తైదువ.

32. తెగన్, ఆడిన = కఠినముగా సాహసించి, పల్కిన; విస్మయ, శోక, తాపములు = భ్రమ, వ్యసనము, తహతహలు.

36. వగలు = దుఃఖము.

38. లేగ = దూడ, మలంచిన = త్రిప్పిన.

40. శోక, శిఖి = వ్యసన, మనునిప్పు; కాఱియవెట్టగ = యాతనపడజేయగా.

41. తత్ = ఆమెయొక్క; హవ్య, వహుడు = హవిస్సులను, దేవతలకు మోసికొని పోయి యిచ్చువాడు: అగ్ని.