పుట:2015.328620.Musalamma-Maranam.pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


లఘుటీక

1. ధామా = ఇల్లుగలవాఁడా !

2. విరించియై = బ్రహ్మయై; జన, ఓఘ, మహా, ఆర్తి = జన, సమూహముయొక్క, గొప్ప, మనస్సంకటమును; హరియించు = పాపు

3. యక్షునకు = ఇచట కుబేరునకని యర్థము; ప్రకరములు = సమూహములు; ఇచ్చె గోపాలునకన్యభాగము = మోహినీరూపమును దాల్చిన విష్ణువునకు దక్కిన సగభాగము నిచ్చెను.

5. నిజ, ఏక, చర్య = తనదియగు, ప్రత్యేక, ప్రవర్తనముచేత; అద్రి, సుత = మలబిడ్డ: పార్వతి.

6. అంచ తేజీ = హంసయనెడు, గుర్రము: హంసవాహనము; చిలువల, యెకిమీడు = పాముల, రాజు; ఆదిశేషుడు; నెజ్జ = పరుపు; గిత్త, తత్తడి, రౌతు = ఎద్దు అను గుర్రమును, సవారిచేయువాడు: వృషభవాహనుడు ఈశ్వరుఁడు; బుత్తిముత్తులు = భుక్తి ముక్తులు; సత్తి = శక్తి: పార్వతి.

7. అభవుడు = పుట్టుకలేనివాడు; ఈశ్వరుడు

8. శోణ = ఎరుపు; అనం, తాధీశుడు = అనంతునకు, అధీశుడు; విష్ణువు.

12. ఒజ్జయై = గురువై.

17. లలాటతిలకము = నొసటిబొట్టు.

18. గుంటిపై = గండశిలపై; చియ్య = కండ; నికరము = గణము; ఆరావములు = శబ్దములు.

20. చలత్, ఉత్తుంగ, మహా, ఉగ్ర, భంగ, పటలీ, సంఘట్టన, ఆరావము =కదలుచు, పొడవై, ఎక్కువ, భీకరమైన, అలల, సమూహముయొక్క, పరస్పరము కొట్టుకొనుట వలనబుట్టిన శబ్దమును; ఉజ్వలత్, కూల, అగ్ర, నటత్, తరంగ, రవము = మొరయుచుండు, తీరపు, చివరలను, ఆడునట్టి, అలలయొక్క, శబ్దమును; అంచత్, మధ్యభాగ, భూమిభృత్, కుల, సంపాతిన్, మహా