పుట:2015.328620.Musalamma-Maranam.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
21
ముసలమ్మ మరణము

బనిచి కన్నుల నొక క్రొత్త ప్రభ సెలంగఁ
జంక నిడికొని ముద్దాడి, జాలిదోఁప. 92

గీ. అన్న పోర; నీకు నమ్మ యెక్కడిదింక?
తండ్రిగారిఁ గూడి తనరు మయ్య;
నన్నుఁ దలఁచి తలఁచి నాయనా యడలంగ
వలదు; పోయివత్తుఁబంపు తండ్రి! 93

మ. అనుచున్‌ బిడ్డనిఁ గౌఁగిలించి తమి మూర్ధాఘ్రాణముం జేసి, యొ
య్యన, భద్రంబని ప్రాణనాథునికిఁ దానర్పించి యర్పించుచోఁ
దనకుం బట్టక వచ్చు బాష్పముల నాతం డేడలక్షించియే
డ్చునొయంచానన మొండుదిక్కునకు నాశోభాంగిచేర్చెన్వడిన్‌. 94

వ. అంత మర్యాద తోఁపఁ గొంత దవ్వుల నున్న జన సంఘమ్ము నుపలక్షించి. 95

గీ. అన్నలార! మిమ్ము నడిగెద నొక చిన్న
వరముఁ దప్పకుండఁ బడయఁ గోరి,
కాదు గీదటంచు వాదుసేయక, గొప్ప
బుద్ధిచేసి యిచ్చి ప్రోవరయ్య. 96

క. నను గాఢంబగు రాగం
బునఁ, గాంచిన బిడ్డఁబోలెఁ బ్రోచిన మీకున్‌
పెనుకష్టము వచ్చెను, మీ
ఋణమిప్పుడు తీర్ప బుద్ధి కెంతయుఁ దోఁచెన్‌. 97

చ. అని మఱుమాటలాడక నిజానన ముర్వికి వంచి, మానసం
బున శివునెంచి, దేవ! శుభమూర్తి! భవత్కృప నాయఘంబు లె