పుట:2015.328620.Musalamma-Maranam.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలమ్మ మరణము

13

జనముల కష్టము చందముఁ
దన పూన్కి తెఱంగు, వినయ తత్పరమతియై. 47

వ. పిట్ట పిడుగున్నట్టుండి శ్రవణరంధ్రంబుల విదారించిన వడువునఁ గర్ణకఠోరంబులై, నిజమృదులతర హృదయ పుటవిభేదనకారణంబులగు మార్గణంబులై, వీతెంచిన యాయోషామణి భాషణంబులచేఁ దన మనంబు తామరపాకునందలి జలబిందువుం బలె నల్లలనాడ, నుల్లంబు జల్లన, మూర్ఛవోయి, కళదేఱి, యన్నిటికి నీశ్వరుండు గలండని ధృతివహించి, దీర్ఘనిశ్వాసపూరిత ముఖుండయ్యును, చలింపని యెలుంగేర్పడ నతండిట్లనియె. 48

గీ. ఎంతమంచి మాటలు పల్కితేమిచెప్ప!
యింత కఠినచిత్తము నీకు నెట్లుకలిగె?
తెలిసి తెలిసి నన్నిట్టులు పలుకఁ దగునె?
పడఁతి! నీవు లేకున్న నే బ్రతుకఁ గలనె? 49

క. నినుమాని నిముస మేనియు
వనజానన! యుండఁగలనె? ప్రతిన నెఱపఁగన్‌
జనఁదలఁచితేని, నన్నున్‌
గొనిపో నీవెంట, నిపుడ గోరిక వత్తున్‌. 50

క. అది గాని నాఁడు, సేమ
మ్మొదవఁగ నీయూరు విడిచి యొండొక యెడకే
గుద మది మేలుగదా మన
కుఁదగన్‌ గాఁపులను గూడి గొబ్బునఁ దరుణీ! 51

గీ. నోరునొవ్వఁ బల్కఁగనేల? సారసాక్షి
వినుము ననుఁ జంపినను నీకు ననువుగాఁగ