పుట:2015.328620.Musalamma-Maranam.pdf/19

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
12
ముసలమ్మ మరణము

కఁదనమనంబు శోకశిఖి కాఱియ వెట్టఁగ గుండె చీలఁగా
మదికొకటైనఁ దోఁప కతిమౌనముతో నొకమూలఁజేరఁడే? 40

చ. అహరహమున్‌ దదుజ్జ్వల కరాబ్జకృతాఖిల సౌఖ్యపాలికా
సహితుఁడు, తన్మనోవిభుఁడు, చంద్రముఖిన్‌ గులకాంతఁబాసి దు
స్సహతర దుఃఖ హవ్యవహ చండతరోగ్ర శిఖాపరంపరం
బహువిధబాధలం బొరల, వానిఁ గనుంగొను టెట్లొ యీశ్వరా! 41

వ. అనుచు సమస్త జనంబులుఁ బురపురఁ బొక్కు సమయంబున 42

గీ. తనకుఁ గడుఁగూర్చు ప్రజలకై తాను వేగఁ
బ్రాణముల్‌ వీడ సంతసపడియు బాల
మగని నత్తను మామను మఱఁదుల మఱిఁ
గలజనమ్ముల విడిచిపోఁ గాళ్లురాక, 43

క. లేనగవును గన్నీళ్ళును
గా, నెద తటతటయనంగఁ గాంతుని యెదుటన్‌
వానయు నెండయుఁ గలసెడు
చో నొప్పెడు నభమనంగ, సుందరి నిలిచెన్‌. 44

వ. నిలిచిన నతండు వచ్చిన కార్యమేమని యడుగుటయు, 45

చ. అసమచరిత్ర! భూమి, జలమందును, నగ్నిని, గాలిలోన, నా
కసమున, మీకు గోచరము కానివిలే; వయినన్‌ మదీయమా
నసమును నేన చెప్పఁగ వినం గడు వేడుకపుట్టెనొక్కొ మీ
కు? సతుల మాటల న్వినఁగఁ గోరుట భర్తల రీతియే గదా! 46

క. అని, పూస గ్రుచ్చినట్లుగ
వనితామణి దెలిపె దేవి వార్తలరీతిన్‌,