పుట:2015.328620.Musalamma-Maranam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముసలమ్మ మరణము

9

యాలకించి వేగ నాదరింపుము మమ్ము
జాగు సేయుట కిది సమయ మౌనె? 26

ఉ. ఇంతకొ యింకఁ గొంతకొ యహీనతరంగ భుజాగ్ర దర్పదు
ర్దాంతతఁ గట్టఁ ద్రెంచి, పటుదంత విఘర్షణపీడ మానసా
క్రాంతమహోగ్రకోపశిఖి గల్గు నురుంగు మొగంబు నిండఁగా,
సంతత సింహనాదము విశాల వికార శరీరముం దగన్‌ 27

గీ. రక్కసుని మాడ్కి మమ్మెల్ల నొక్క గ్రుక్క
గొనఁగ మారి మసంగి నట్లెనసివచ్చు
నీ చెఱువు బారినుండి మమ్మెల్ల నెట్లు
శుభముగా నేలుకొందువో చూడవలయు 28

క. అమ్మా! నేఁటివఱకు మము
ముమ్మరమగు కూర్మిఁ బెనిచి మురిపెంబఱ నేఁ
డిమ్మాడ్కిఁ జెఱువు వాతం
జిమ్మఁగ మనసెట్లు వచ్చుఁ జెప్పుము తల్లీ! 29

వ. అనునంత నాకాశవాణి. 30

క. బసిరెడ్డికిఁ గడ కోడలు
ముసలమ్మ యనంగనొప్పు పుణ్యాంగన తా
వెస బలిగాఁ బోయిన మీ
కిసుమంతయుఁ గష్టమెన్నఁడేలా కలుగున్‌? 31

క. అని తెగ నాడిన మాటలు
విని విస్మయశోకతాపభృత భావముతో