పుట:2015.328620.Musalamma-Maranam.pdf/15

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
8
ముసలమ్మ మరణము

చ. కడవల ముంచి వంచిన ప్రకారము, మన్నును, మిన్ను నేక మ
య్యెడు గతి, రేవగళ్లు నొకటే విధమొప్పఁగ, నాకసంబు తూఁ
టిడెనొ యనంగ, బల్పిడుగు లెక్కడఁజూచిన రాలుచుండఁగా
సుడిగొని గాలియున్‌ విసర, జోరని వాన లొకప్డు వచ్చినన్‌ 21

శా. ఆ లాగుంగని రెడ్లు రైతులును దా మాలోచనల్‌ చేసి “యే
కాలం బందును నిట్టి వానల వినం గానంగ లేదెవ్వరున్‌
ఏలాగో మన మేమి చేయఁగల” మం చెంతేని భక్తిన్‌ వడిం
“బోలేరమ్మకుఁ బొంగలో” యనుచు సమ్మోదించి చాటించినన్‌ 22

క. నల్లని కోళ్లను బొట్టే
ళ్ళెల్లరుఁ గొని మగలఁగూడి యే తెంచిరి యా
పల్లియ కొమ్మలు మిక్కిలి
జిల్లను నా గాలి తనులు చిలచిల వడఁకన్‌ 23

క. పొంగళ్లు దిగిన తోడనె
రంగుగ బలులిచ్చి, పళ్ళెరమ్ముల తళియల్‌
వొంగారఁగఁ, బూజారు ల
నంగారిశుభాంగి వర్ణనల్‌ చేసిరొగిన్‌ 24

క. కరిముఖ విశాఖ చండీ
శ్వరభైరవ వీరభద్ర భవ్య కిరీట
స్ఫుర దురు మణిగణ తేజో
భరభాసిత దివ్యపాదపద్మా! కాళీ! 25

గీ. తల్లి! నీకుఁ గోటి దండంబు లర్పించి
భక్తి విన్నవించు వార మమ్మ