పుట:2015.328620.Musalamma-Maranam.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దైవంబునే నమ్మి దైవారెఁ దుదకు న్యా
               యస్థానవాదియై యలరెఁ జాలఁ
గార్వేటి నగరాది గంభీర సంస్థాన
               ములకెల్ల నొజ్జయై పూజ లందె

తే. నేకపత్నీవ్రతస్థుఁ, డహీనగుణుఁడు
శారదేందు ప్రభా తిరస్కార కీర్తి,
కట్టమంచి సుబ్రహ్మణ్య ఘనుఁ డతండు
తండ్రి గానొప్ప నెంతయుఁ దనరినాఁడ. 12

క. భారత భాగవ తోజ్జ్వల
వారిధి గత సార పద్య వరమణి చయమున్‌
హారముగఁ గూర్చె నెవఁడా
సూరిని మజ్జనకుఁ దలఁచి చూడుఁడు నన్నున్‌.

[1]

  1. స్తుతిప్రకరణమునందలి పద్యములు పెక్కులు 1897-వ సం. చేయఁబడినవి. మా తండ్రిగారు “భారతసారరత్నావళి” బ్రకటించుటకు బూర్వమును, కూచిమంచి సోమసుందరకవిగారు వ్రాసిన,

    మ. తత బోధారస దీపితాఖిలమహా ధర్మోర్మికోవేత భా
    రతవార్ధిన్ గల సార పద్యమణులన్ రత్నావళిం గూర్చె నీ
    శ్రుతితత్త్వజ్ఞుఁడు సూతుఁడో, శుకుఁడో, వ్యాసుండో, గదేయంచు ధీ
    రత మిమ్మందురు కట్టమంచికుల సుబ్రహ్మణ్య పుణ్యా హ్వయా.

    అను పద్యమునుజూచి 13-వ పద్యమును గట్టితిని.