పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

విశ్వనాథనాయకుఁడు

చోడునిఠాణాలనుఁ దఱుమఁగొట్టి యారాజ్యమునుఁ గూడ వశపఱుచుకొని రాయలయాజ్ఞ నుల్లఘించి చంద్రశేఖర పాండ్యునికి రాజ్యము నొసంగక రెండురాజ్యములనుగూడఁ దానే పరిపాలనము సేయుచుండెను. అంత నాగమనాయని చర్య కచ్చెరువందుచు చేయునదిలేక నిరుత్సాహుఁడై పాండ్యుఁడు మరల విజయనగరమున కేతెంచి రాయలకు యావద్వృత్తాంతము నివేదించెను.

అంతట రాయ లాశ్చర్యమునుజెంది "ఇది యేమి చిత్రముగా నున్నది! నీవు మా యాజ్ఞాను నెఱవేర్పక పాండ్యునిరాజ్యము పాండ్యునికీక నీవే యపహరించి పరిపాలించుచున్నావు. ఇట్లు చేయుమని నీకాజ్ఞ నొసంగి యుండ లేదే! ఈ యాజ్ఞాపత్రమునుఁ జూచికొన్న వెంటనే పాండ్యరాజ్యమును పాండ్యుని కిచ్చివేసి మాసన్నిధానమునకు రావలసినది." అని యొక యాజ్ఞాపత్రమును వ్రాయించి పంపించెను.

ఇట్లు పంపించిన యాజ్ఞాపత్రమును జదివించుకొని విని మరల తా నీక్రింది విజ్ఞప్తిని బంపుకొనియెనఁట.

"దేవరవారియాజ్ఞ నుల్లంఘించుటకు నే నెంతవాఁడను; నావిషయమై దేవరవారికి విన్నవింపఁబడిన విషయము లన్నియు సత్యములు గావు; నేను పాండ్యరాజ్యముఁ జేరునప్పటికి రాజ్య మంతయు నరాజకమై యుండెను. ఇంతకుఁబూర్వము చంద్రశేఖరపాండ్యుఁడు రాజ్యముచేయునపుడుకూడ నరాజకముగనే