పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

83

వారు వచ్చి పైఁబడి రట! వారిని నిల్వరించుట దుస్సాధ్యముగ నుండి కుప్పతిప్పలుగఁ దమవారు గూలుచుండుటఁ జూచి రణరంగమున నిలువఁజాలక తొలుత మధురసైన్యము వెన్నిచ్చిపాఱఁ దొడంగెను. ఆదురంతమును జూడ జగ్గరాయలును వానిబందువర్గమును, వానిసైన్యములును రఘునాథనాయని సైన్యముల నెదుర్కొని ఘోరసంగ్రామము సలిపిరి. జగ్గరాయనిఁ జూచినతోడనే రఘునాథనాయఁడు సింహగర్జనము గావింపుచు తన యీటెలపటాలమునుఁ బురి కొల్పుకొని వానిపయిఁ బడి యీటెలతో వానిని, వానిబంధువులను, వానిసైన్యములను బొడిచివైచి నాశనము గావించిరఁట.

జగ్గరాయనిచే నాశనము గావింపఁబడిన యానకట్ట వానిసైనికుల పుఱ్ఱెలతో నింపి రక్తముతో నదికించి యా యానకట్ట రఘునాథనాయఁడు పునర్నిర్మాణము చేసెనా యన్నట్లుగఁ గంటి కగపడె నని రామభద్రాంబ వర్ణించినది. ఎప్పుడు జగ్గరాయలును వానిబంధువర్గమును సమరముననేలఁ గూలిరో యప్పుడు వీరప్పనాయనికిఁ దనరాజ్య ముండునో యూడునో యను భీతి జనించి దానిఁ గాపాడుకొనవలయు నన్న యావేదనతోఁ గూడినయాతురము పుట్టెను. తన యేనుంగులను, తనగుఱ్ఱములను, తనబొక్కసమును తన కుటుంబమును సహితము విడిచిపెట్టి క్రోశమాత్రము సిగ్గును పోఁద్రోలి పఱువెత్తుకొని పోయెనఁట! తుండీరవిభుఁ డయిన