పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

వెలుగోటి యాచమనాయఁడు

ఈ కమ్మవక్కణమునందు రామదేవరాయనిపక్షములోని నాయకులను వక్కాణించునపుడు యాచమనాయని నామము స్మరింపఁబడ కుండుట నత్యాశ్చర్యకర మైనవిషయము. ఇందేకాదు. రఘునాథాభ్యుదయమునందు నీకీర్తి యంతయు రఘునాథనాయని కొక్కనికె కట్టిపెట్టెను. బహుళాశ్వచరిత్రమునందొక్క యాచనికె ముడివెట్టెను. రామ రాజీయమున యాచమనాయని యర్జునునిగను, రఘునాథనాయని కృష్ణునిగను, జగ్గరాజును దుర్యోధనునిగను, రామదేవరాయని ధర్మరాజుగను, చెంచునాయని దుశ్శాసనునిగను,వీరప్పనాయని శకునిగను, వెంకుని శల్యునిగను, మాక రాజును కర్ణునిగను, రామదేవుని మేనమామ యగుజిల్లేళ్ల సింగరాజును (నరసింహరాజు) భీమసేనునిగను నభివర్ణించి కురుపాండవయుద్ధముతోఁ బోల్చియున్నాఁడు.

రామభద్రాంబ యను కవయిత్రి తాను రచించిన 'రఘునాథాభ్యుదయ' మను సంస్కృతకావ్యమునం దీ యుద్ధము ని ట్లభివర్ణించి యున్నది. శత్రుసైన్యములతో రాయల సైన్యములు యుద్ధమునకుఁ దలఁపడినప్పుడు పూర్వ పశ్చిమసాగరములు రెండు నెదుర్కొన్న ట్లుండెనఁట! మొట్టమొదట ఫిరంగులు తుపాకుల యుద్ధముఁ బ్రారంభమై కొంత కాలము జరిగినవెనుక రఘునాథరాయని యాశ్వికపటాల మర్ధచంద్రాకృతిగ నేర్పడి మధురసైన్యములను తారసించి చుట్టఁబెట్టి ధ్వంసము చేయుచుండ వసరివెనుక పదాతివర్గము