పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

77

ఈ క్రిందిలేఖ తంజాపురీశ్వరుఁడును, రఘునాథనాయని పుత్రుఁడు నగు విజయరాఘవనాయనిచే రచియింపఁబడిన 'రఘునాథాభ్యుదయ' మను నాటకమునఁ జొనుపఁబడి యన్నది.

కమ్మవక్కణః-
              "శ్రీమన్మహాచోళ సింహాసనేంది
               రా మనోహరు లైనరఘునాధ
               నయ్యవారికి యుత్తరాది గుంటూరి
               యయ్యపరాజు నారప్ప విన్నపము.
               లంచిత నలవత్సరాషాఢ శుద్ధ
               పంచమీపుష్యార్కపరిఘయాగమున
               స్వామివారా పళవానేరినగర
               నామతీర్థము పురాణశ్రవణంబు
               రామవిగ్రహపూజ రామజపంబు
               శ్రీమూర్తి దానాద్య శేషదానములు
               గావించి విజయంబు గలుగ నక్షతలు
               శ్రీవైష్ణవు లొసంగ శిరమునఁ దాల్చి
               ఆదిత్యహృదయజపానంతరమున
               నయుదారుగడియలయపు డారగించి
               భేరుల మ్రోయించి పెండ్లికిఁ బోవు
               తీరున తగిన ముస్తీదు గావించి
               యెదుటి పాళెంబున కెఱుక సేయించి