పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వనాథనాయకుఁడు

5

తోఁ దడుపుచుఁ దన దౌర్భాగ్యదశనంతయు నేకరువుపెట్టి "ఓమహాప్రభూ! సార్వభౌమా! 'దుర్బలస్యబలంరాజా' యను న్యాయము మీ రెఱుంగనిది కాదు; మాకు దిక్కు మీరు గాని యన్యులు గారు; ఏమియాజ్ఞ? యని మొఱలెత్తెను. వీని మెఱల నాలించి రాయలు జాలిగొని కోపోద్దీపితమానసుండై తన 'తోషేఖానా' కధికారి యైన నాగమనాయని రప్పించి వింటివా వీరశేఖరుని దుండగము? వీఁడు మనలఁ గాదని యలక్ష్యభావముతోఁ దిరస్కరించి బలాత్కారముగా పాండ్యరాజ్యము నొడిసిపెట్టి చంద్రశేఖరపాండ్యుని సాగనంపి రాజ్యము నేలుచున్నవాఁడఁట! నీవు తత్క్షణము మాయాజ్ఞ శిరసావహించి తగుసైన్యముతోఁ బోయి యా దుండగీని శిక్షించి వీనిరాజ్యమును వీని కిప్పించి చోళరాజ్యమును మాకుఁ బ్రతినిధిపాలకునిగా మఱియొకరిని నియమించి సామ్రాజ్యమునకుఁ జెల్లింపవలసిన కప్పములను, దారిబత్తెముల మీకగుఁ వ్రయమునంతయు రాఁబట్టి రాజ్యమున శాంతినెలకొల్పి రావలయునని యాజ్ఞచేసెను. అపుడు సార్వభౌమునియాజ్ఞ శిరసావహించి నాగమనాయఁడు చంద్రశేఖరపాండ్యుని వెంటఁగొని రెండువేలయాశ్వికులను, ఆఱువేలపదాతులను దోడుచేసికొని పాండ్యరాజ్యముపై దండయాత్ర వెడలెను. తొలుత నాగమనాయఁడు తంజూవూరికిఁ బోయి వీరశేఖర చోడుని నోడించి వానిని శిక్షించి వాని రాజ్యమును దాను వశపఱుచుకొని మధురాపురముపైకి పోయి