పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

వెలుగోటి యాచమనాయఁడు

లై జగ్గరాయలపక్షమునఁ జేరికొనిరి. ఉత్తరభాగమునందలి మండలాధిపతులలోనే యిద్దఱుముగ్గురొ తక్క తక్కినవారు రామదేవరాయని ప్రక్కజేరినవా రగుటచేత ప్రధానయుద్ధ రంగము దక్షిణదిశయందే యేర్పడుటచేత నుత్తరమండలాధిపతుల సైన్యముల సంఖ్యకంటె దక్షిణమండలాధిపతుల సైన్య మధికముగ జేరుట కనుకూలపరిస్థితులు కలవు. కాన తంజాపురాధీశ్వరుఁడు రఘునాథనాయకుఁడు సామ్రాజ్యపక్షమునఁ జేరుటచేత నాలోపము గన్పట్ట లేదు. మఱియును జగ్గరాజు పన్నిన దుస్తంత్ర ముత్తరమండలములవారికి బోధపడునట్లు దక్షిణమండలములవారికి బోధపడి యుండక పోవచ్చును. అదియునుగాక తుండీరమధురమండాలాధిపతులు జగ్గరాయని చేరుటకూడఁ గా వచ్చును. కొందఱు జగ్గరాయని పక్షమే న్యాయ మైనదని తలంచి యుండ వచ్చును. ఈ తుది యుద్ధమునాఁటికి జగ్గరాయలు తననాయకత్వమును పాండ్యమండలాధీశ్వరుఁ డగు వీరప్పనాయనికిని, యాచమనాయఁడు తన నాయకత్వమును చోళమండళాధీశ్వరుఁ డగురఘునాథ రాయనికిని విడిచిపెట్టి రని చెప్పక తప్పదు. ఇట్లుభయపక్ష సైన్యములకు గావేరీతీరమున తోపూరుగ్రామ సమీపమున ఘోరసంగ్రామము జరిగినది. ఈ యుద్ధము 1616 - 17 సంవత్సరమున జరిగినట్లు గుంటూరివాస్తవ్యుఁ డయిన అయ్యపరాజు నారప్ప వ్రాసిన కమ్మనక్కణ మను లేఖ వలనఁ దెలియుచున్నది.