పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
72
వెలుగోటి యాచమనాయఁడు

ముద్దువీరప్పనాయని సైన్యములతో జేరుకొనవలయు నని చేయు ప్రయత్నములను భగ్నము గావింపుచు దమ సైన్యములను మధురనాయకునకు శత్రువును, వీరవేంకటపతిరాయల భృత్యకోటిలోనివాఁడై యత్యంత మిత్రుఁడుగా నుండి సామ్రాజ్యపక్షమున నున్న తంజావూరినాయకుఁ డగురఘునాథ నాయని సైన్యములఁ గలిసికొనవలయు నని యాచమనాయఁడు మొదలుగా రాజపక్షమువారి ప్రయత్నములను భగ్నము గావింపుచు జగ్గరాజు మొదలుగా రాజద్రోహ పక్షమువారును, బ్రయత్నించుచుండుటవలన నాకాలమునఁ బలుతావులయందు నుభయపక్షములవారికిని ఘోరయుద్ధములు జరుగుచు వచ్చెను. ఎంతటిమహావీరుఁ డైనను రఘునాధనాయనితోఁ గలియకున్న యాచమనాయఁడు జగ్గరాయని సైన్యములను, వారిపక్షమువారి సైన్యములను నోడించుట సులభసాధ్య మగు కార్యము కాదు. యాచమనాయనికి రఘునాథరాయలను గలిసికొనవలయునన్న తుండీరమండలాధిపతి రాజ్యములోనుండి పోవలయును గాని వేఱొక మార్గ మనువుగఁ గన్పట్టలేదు. ఈసందర్భమున జగ్గరాయని తోను, వానిపక్షమునఁజేరి సామ్రాజ్యమునకు విద్రోహులుగాఁ బ్రవర్తించుచున్న తదితరులతోను యాచమనాయనికి జరిగిన యుద్ధములనే తనబహుళాశ్వచరిత్రమునందు దామర్ల వెంగళభూపాలుడు తన బావమఱఁదియగు యాచమనాయని శౌర్యకృత్యములను దావలుపాపవిభు నుత్తరమల్లూరి