పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/71

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
68
వెలుగోటి యాచమనాయఁడు

నాశనమై పోయినది.

ఇట్టి దుష్కృత్యమును గావించిన జగ్గరాయలకు మనశ్శాంతి యెక్కడ కలుగును? యాచమనాయని కీఘోరమైన వృత్తాంతము చెవినిఁబడినతోడనే యాగ్రహమహోదగ్రుఁడై జగ్గరాయని కిట్లు వర్తమాన మంపెను.

"ఓజగ్గరాయా! నీస్వాధీనములో నున్న నీ ప్రభువును, వానిబిడ్డలను దయ లేశములేక సంహరించి పౌరుషహీనులు గావించు దుష్కృత్యముఁ జేసినావు. అది వీరపురుషధర్మము కాదు. నీవు పురుషుఁడ వైతేని యారాయలపుత్రుఁడే యొకఁడు సురక్షితముగా నాకడ నున్న వాఁడు. వానిని నాతోఁ గూడ నీవును నీసైన్యములు వచ్చి బహిరంగప్రదేశమునఁ గత్తికట్టి పోరాడి జంపుఁడు. అప్పుడుగాని నీవును నీమేనల్లుఁడును ప్రభుత్వము సేయుటకు సమర్థులు కారు. అట్లు చేసిన నాడె నీమేనల్లుని సింహాసనమునఁ గూర్చుండబెట్టఁగలవు. అంత పర్యంతము రాజ్యము నీకుగాని నీమేనల్లునకుగాని స్వాధీన మైన దని తలంపకుము. నిన్ను మాత్రము ప్రాణములతో విడుచువాఁడను గా నని యెఱుంగుము. ఇట్టి దుర్మార్గముఁ జేసిన నిన్ను దునుమాడుదనుక నీయాచమనాయఁడు నిద్రించు వాఁడు కాఁడని నమ్ముము.

జగ్గరాయలు గావించిన యీదుష్కృత్యము దేశమం దంతట వెంటనే వ్యాపించెను. అట్లు వ్యాపించినతోడనే రంగరాయలయం దభిమానము, విశ్వాసముగల సామంతరాజులు,