పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/59

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
56
వెలుగోటి యాచమనాయఁడు

యున్నత పదవికిఁ గొనివచ్చెద' నని వాగ్దత్తము చేయుచు నొక జాబు వ్రాసిపంపెను.

"అహో! నేఁ డితఁడు వంచకుఁ డై నావంశమును, నాపౌరుషపరాక్రమములను, నాసుగుణములను బొగడుచు నన్ను లంచములనిచ్చి లోపఱుచుకొనవలయు నని సంకల్పించి యీజాబు వ్రాసియున్నవాఁడు. నేనా యీ మాయలమారి మల్లన్నకు లోబడునది" అని తలపోసి 'ఏమీ! నాకు జగ్గరాయలు భూములొసంగునా? నాకు భూము లిచ్చుటకు జగ్గరాజునకు భూము లెక్కడివి? ఈభూములు నాప్రభు వగు శ్రీరంగరాయలవి కావా? నా ప్రభువుభూములను, ధనమును దానము చేయుటకు జగ్గరాజునకు హక్కుగలదా? అతని యందే నాభక్తి కుదురుకొని యున్నది. అతనికే నాసేవ ఇతరులకుఁ గాదు. అని పలికి 'ఓయీ! పో; పొమ్ము; పోయి నీ సామంతు లందఱితో గలిసి దండెత్తి రమ్ము. మీచేతనైన న న్నోడింపుఁడు. నేనుమాత్రము నా ప్రభువును విడిచి యీషణ్మాత్రమైన హక్కు గాని, పేరు లేనిబొమ్మను సేవించుఁవాడను గా నని నా యీపలుకులను నెల్లవారు వినునట్లుగా బహిరంగ సభలోఁ బల్కుము. పొమ్ము.' అని వానినిఁ బంపివేసెను.

ఇ ట్లత్యంతము రంగరాయనిమీఁది భక్తి ప్రేరేచు చుండఁగా నత్యమిత ధైర్యసాహసములతో నెదుర్కొని దర్పముఁ జూపుచు శత్రువు పల్కుచున్న గంభీరోక్తులకును,