పుట:2015.328360.Andhra-Mahaniyulu.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వెలుగోటి యాచమనాయఁడు

53

నున్నవాఁ డంతలో దిక్కుమాలినవాఁడు గావలసివచ్చెను. ఆహా! మానవుని బ్రతు కింతేగదా! రాయలపక్షమున నున్న మహావీరు లందఱునుఁ బిఱికిపంద లైపోయిరి. రాయల కంతయు నంధకారబంధురముగాఁ గన్పట్టెను. పాప మాదురదృష్టవంతుఁ డైన రంగరాజు వెల్తురు నెప్పటి కయినను జూడఁ గలుగుదునా యని తలపోయు చుండెను. రాయవేలూరునగరమున నుద్భవించి దట్టముగా నలముకొన్న యీ మబ్బులు సామ్రాజ్యము నంతయు వ్యాపించిపోయినవి.

కాని విజయనగరసామ్రాజ్యము శూరుల కెన్నడను బేదవడి యుండలేదు. ఈ విప్లవసమయమున నొక మహావ్యక్తి బాలభాస్కరునివలె విజృంభించుట కవకాశము చిక్కెను. ఆవ్యక్తియె మన కథానాయకుఁ డైన శూరవరాగ్రణి.

ఆదినమున వేలూరునగరమున వెలుగోటి యాచమనాయఁడు లే కుండెను. ఆనగరమునకుఁ గొన్నిమైళ్లదూరమున నున్నవాఁడు. ఇచట నేమి జరిగియుండునో యాతఁ డెఱుంగ కుండెను. ఈ దుర్వార్త చెవిని బడినతోడనే తాను తన దుర్గమునకుఁబోయి తనసైన్యమునంతయు నొక చోటికిఁ జేర్చికొని తనకు మిత్రుఁ డయిన రాయలపక్షముఁ బూని యెప్పుడు శత్రువులను మర్దించి రాయలను రక్షించి సామ్రాజ్యమును రాయలకు నిలుపుట కవకాశము గలుగునా యని నిరీక్షించు చుండెను.

అట్లు జగ్గరాయలు రాయవేలూరు నాక్రమించుకొని రంగరాయలను, వానికుటుంబమును చెఱశాల యందుంచెను. తన